Gummanur Jayaram: వైసీపీ నేతలపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 09:52 PM
వైసీపీ నేతలపై గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) గుత్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అమరావతి: వైసీపీ నేతలపై (YSRCP Leaders) గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (శుక్రవారం) గుత్తిలో టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు.
వైసీపీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లోపు టీడీపీలోకి రావాలని గుమ్మనూరు జయరాం డెడ్‌లైన్ విధించారు. వైసీపీ నేతలకు స్థానిక ఎన్నికల వరకు టైమ్ ఇస్తున్నామని.. ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేస్తారేమో...తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని వైసీపీ నేతలను గుమ్మనూరు జయరాం హెచ్చరించారు.
జగన్‌కు భయం పట్టుకుంది: వేమూరి ఆనంద్ సూర్య
వైసీపీ హయాంలో తిరుమలకు చెందిన రూ.2 కోట్ల విలువైన తలనీలాలు తరలించారని తెలుగుదేశం పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆరోపించారు. టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు రూ. 5 వేల కోట్లు దారి మళ్లించాలని చూశారని మండిపడ్డారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పట్టిన గతే భూమన కరుణాకర్‌రెడ్డికి పడనుందని హెచ్చరించారు. ఇవాళ(శుక్రవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వేమూరి ఆనంద్ సూర్య మీడియాతో మాట్లాడారు.
చాలా పాపాలు చేసిన వైసీపీ నాయకులకు 11 సీట్లు వచ్చాయని వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. తెనాలి, పొదిలి, సత్తెనపల్లిలో జగన్, వైసీపీ నేతలు ఆడిన నాటకాలు అందరికీ తెలుసునని చెప్పారు. హిందువుల మనోభావాలు ఎటుపోతే ఏంటనే ధోరణిలో జగన్, భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారని అన్నారు. వైసీపీ హయాంలో పేద, మధ్య తరగతి వాళ్లకు తాళిబొట్లు ఇస్తామని తప్పించుకున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పథకాలు అమలైతే..తమకు పుట్టగతులుండవని జగన్‌కు భయం పట్టుకుందని వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి
For AndhraPradesh News And Telugu News