Share News

Blind Cricket Team: అంధ మహిళల క్రికెట్ టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు , లోకేశ్

ABN , Publish Date - Nov 23 , 2025 | 09:55 PM

నేపాల్‌తో జరిగిన ఫైనల్స్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

Blind Cricket Team: అంధ మహిళల క్రికెట్ టీమ్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు , లోకేశ్

అమరావతి, నవంబర్ 23: అంధ మహిళల టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం నేపాల్‌తో జరిగిన ఫైనల్స్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ టీమ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ .. కంగ్రాట్స్ చెప్పారు. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాల వేదికగా స్పందించారు.

మొట్టమొదటి అంధుల మహిళల టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టుకు సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఆటలో వీరు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారని తెలిపారు. మన దేశానికి వీరు మరిన్ని ప్రశంసలు తీసుకువస్తారని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మనందరిని గర్వపడేలా చేయాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.


ఈ రోజు తొలి అంధ మహిళల టీ 20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించిన భారత్‌ జట్టుకు మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశానికి ఈ పురస్కారాన్ని తీసుకురావడంలో వీరి ధైర్యం ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుందన్నారు. భారత్ జట్టుకు గట్టి పోటీ ఇచ్చిన నేపాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Indian women blind cricket: అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..

Vizag girl Karuna Kumari: తెలుగు ఖ్యాతిని పతాక స్థాయికి చేర్చిన అంధ బాలిక..

Updated Date - Nov 23 , 2025 | 10:34 PM