MLC Elections: వారు ఓటు వేయడం నాకు గర్వకారణం: ఆలపాటి రాజా
ABN , Publish Date - Mar 04 , 2025 | 08:32 AM
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.

గుంటూరు జిల్లా: కృష్ణా (Krishna)-గుంటూరు (Guntur) స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి (TDP Leader) ఆలపాటి రాజా (Alapati Raja) అనూహ్య మెజారిటీతో విజయం (Victory) సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు అపూర్వ విజయమని అన్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లు ముందుగానే డిసైడయ్యారని ఆయన అన్నారు.
Read More..:
అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం
ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదుటివారిపై బురదచల్లే విధంగా రాజకీయాలు చేశారని మండిపడ్డారు. తనకు మెజారిటీ వచ్చినన్ని ఓట్లు కూడా పీడీఎఫ్ అభ్యర్థికి రాలేదని ఎద్దేవా చేశారు. పీడీఎఫ్ కూడా ఇతర రాజకీయ పార్టీలా తయారైతే సమాజంలో గౌరవం తగ్గిపోతుందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తనకు ఓటు వేయడం గర్వకారణంగా ఉందన్నారు. నిత్యం తాను ప్రజలలో ఉండే వ్యక్తినని ఆలపాటి రాజా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం..
నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News