Ganesh Sharma: గణేష్ శర్మ వేద విద్యాభ్యాసం ఇక్కడే..
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:10 PM
Ganesh Sharma: కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో రుగ్వేదం అభ్యసించారు. వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు.

కంచి కామకోటి పీఠ ఉత్తరాధికారిగా గణేష్‌శర్మ
రేపు కంచిలో బాధ్యతలు
ద్వారకా తిరుమలతో అనుబంధం
దేవస్థానం రుగ్వేద ఘనాపాఠి రత్నాకర్‌శర్మ వద్ద వేదాభ్యాసం
ద్వారకాతిరుమల, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): కంచికామకోటి పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సత్యవెంకట సూర్యసుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రవిడ్ ద్వారకా తిరుమలలో 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు రుగ్వేదం అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలో ఉన్న మేనమాన ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను అదే సమయంలో తిరుపతి వచ్చిన కంచి కామ కోటి పీఠం శంకరాచార్య స్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ఈ బాలుడిని ద్వారకా తిరుమల దేవస్థానం రుగ్వేద ఘనాపాఠి రత్నాకర్ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. ఆయన వద్ద శిక్షణ తీసుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. దీంతో ఆయనను ద్వారకా తిరుమల రత్నాకర్ శర్మ వద్ద వేద విద్య కోసం చేర్పించారు.
ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, కర్నాటక రాష్ట్రానికి చెందిన చందుకొట్లు హూసమని రత్నాకర శర్మ ఇంటి వద్దే ఉంటూ విద్యనభ్యసించారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిల్లో నిష్ణాతుల య్యారు. వేదాలకు అర్థాలను అధ్యయనం చేశారు. అనంతరం రత్నాకర్ శర్మ కుమారుడు ప్రస్తుత విజయవాడ కనకదుర్గ దేవస్థానం రుగ్వేద పండితుడు శ్రీనివాస శర్మ వద్ద కూడా కొన్నాళ్లు వేద విద్యను నేర్చుకున్నారు. ప్రతిశాఖ్య, వ్యాలిశిక్ష వంటి వేద పుస్తకాలను అభ్యసించడంతో పాటు మంత్రోచ్ఛరణ విధానాన్ని అభ్యసించారు. వీరిద్దరూ ఇచ్చిన శిక్షణ ఫలితంగా సంస్కృతం, వేద పుస్తకాలు, వేదాంత విద్య వంటి అంశాల్లో గణేష్‌శర్మ ఆరితేరారు. తరువాత బాసర దేవాల యంలో రుగ్వేద పండితుడుగా కొన్నాళ్లు సేవలందించారు.
కంచి కామకోటి పీఠ ప్రస్థానం ఇదీ
కంచి కామకోటి పీఠాన్ని జగద్గురు ఆదిశంకరాచార్య దాదాపు 25 శతాబ్దాల క్రితమే స్థాపించారు. మొదట్లో ఈ మఠం కుంభకోణంలో ఉండేది. ఆ తరువాత 18వ శతాబ్దంలో కాంచీపురానికి తర లించారు. ఎంతో సుదీర్ఘచరిత్ర కల ఈ మఠానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులున్నారు. కంచి పీఠాధిపతులు బిల్వదళ అర్చనలో నిష్ణాతులై ఉంటారు. 68వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతికి భూమిపై నడిచే శంకరుడు అనే పేరుంది. 1907 నుంచి 1994 వరకు దాదాపు 87 ఏళ్లకాలం పాటు కంచి కామకోటి పీఠాధిపతిగా వ్యవహరించారు. తన 13వ ఏటనే సన్యాస దీక్షను చేపట్టారు. ధర్మప్రభోదాలు చేశారు. ఆయన తరువాత 1994 నుంచి 2018 వరకూ జయేంద్ర సరస్వతి పీఠాఽధిపతులుగా వ్యవహరించారు. ఎన్నో వివాదాల్లో చిక్కుకుని 2014లో కోర్టు తీర్పుతో ఊరట చెందారు. తరువాత 2018లో ఆయన శివైక్యం చెందారు. తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి ప్రస్తుత పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. తన వారసుడుగా 71వ పీఠాధిపతిగా అన్న వరానికి చెందిన గణేష్‌శర్మ ద్రవిడ్‌ను ఎంచుకున్నారు. గణేష్ శర్మ తండ్రి దుడ్డు ధన్వంతరి, తల్లి అలివేలుమంగాదేవి. తండ్రి ధన్వంతరి అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితునిగా చేస్తున్నారు. అక్షయ తృతీయ రోజైన ఈనెల 30న గణేష్‌శర్మ కంచికామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్
Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్ పొడిగింపు
High Court: ఏబీవీ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
For More AP News and Telugu News