Crime News: అక్క కళ్లల్లో ఆనందం కోసమే చంపేశా.. పల్నాడు హత్య కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:53 PM
సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో..
బావ కళ్లల్లో ఆనందం కోసమే హత్య చేశాననే మాట ఒకప్పుడు ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను.. మీడియా ముందు చెప్పిన మాట ఇది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. తాజాగా, పల్నాడు జిల్లా దూళిపాళ్లలో దారుణ హత్య జరిగింది. ఈ హత్య కేసు విచారణలో.. తన అక్క కళ్లల్లో ఆనందం కోసమే బావను హత్య చేశానంటూ నిందితుడు చెప్పడం పోలీసులను ఖంగుతినేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల హత్య కేసులో షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. దూళిపాళ్ల గ్రామంలో ముగ్గురు యువకులు.. శనివారం పట్టపగలు ఇంట్లోకి చొరబడి సాంబశివరావు (36) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతడి తల్లి కృష్ణకుమారి (55) అడ్డుకోబోయింది. దీంతో వాళ్లు ఆమెపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ కృష్ణకుమారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. చాగల్లు గ్రామస్తులు గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అక్క కళ్లల్లో ఆనందం కోసమే..
సాంబశివరావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన అక్క కళ్లల్లో ఆనందం కోసమే.. తన బావను హత్య చేయాల్సి వచ్చిందని ప్రధాన నిందితుడు రోహిత్ చౌదరి అంగీకరించాడు. పోలీసుల కథనం మేరకు.. ధూళిపాళ్లకు చెందిన సాంబశివరావుకు.. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొద్దిరోజుల తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సాంబశివరావు తన భార్యను అనేక రకాలుగా వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక అతడి భార్య ఇటీవలే విడాకులు కూడా తీసుకుంది. అయితే తన అక్కని వేధించిన బావపై.. అతడి బావమరిది రోహిత చౌదరి అప్పటి నుంచే కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రోహిత్ చౌదరి తన స్నేహితులైన రవి కుమార్, షేక్ జావీద్ అస్లాంలతో కలిసి ధూళిపాళ్ల గ్రామానికి చేరుకున్నాడు. ముగ్గురూ కలిసి ఇట్లో బెడ్‌రూంలో మంచంపై పడుకుని ఉన్న సాంబశివరావుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు చెరుకూరి రోహిత్ చౌదరి (పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్), సాతులూరి రవి కుమార్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్), షేక్ జావీద్ అస్లాంలను (ఇంటర్ ఫస్ట్ ఇయర్) పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ విధ్వంసం: మంత్రి నిమ్మల
Read Latest AP News and National News