Share News

Family Reunion: చాలాకాలం తర్వాత బాబు ఇంటికి దగ్గుబాటి

ABN , Publish Date - Feb 25 , 2025 | 05:04 AM

సుదీర్ఘకాలం తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన తోడల్లుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారు.

 Family Reunion: చాలాకాలం తర్వాత బాబు ఇంటికి దగ్గుబాటి

  • ‘ప్రపంచ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానం

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం తర్వాత సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన తోడల్లుడు డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెళ్లారు. ఉండవల్లి సీఎం నివాసం వీరి కలయికకు వేదికైంది. తాను రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును దగ్గుబాటి ఆహ్వానించారు. దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూటమి పార్టీల భేటీల సందర్భంగా పలుమార్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు తరచూ కలుసుకుంటూ ఉంటారు. దగ్గుబాటి, చంద్రబాబు సైతం కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకుంటున్నా చంద్రబాబు నివాసానికి రావడం చాలా కాలం తర్వాత ఇదే. ఈ పుస్తకావిష్కరణకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరవుతున్నారు.

Updated Date - Feb 25 , 2025 | 05:04 AM