Share News

Tirupati Dead Bodies: తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:09 PM

Tirupati Dead Bodies: కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tirupati Dead Bodies: తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం
Tirupati Dead Bodies

తిరుపతి, జూన్ 30: తిరుపతిలో (Tirupati) ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరు యువకుల డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో కారులోనే నిద్రపోయిన ఇద్దరు యువకులు అందులోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కారులో పెట్రోల్ లేకపోవడంతో పాటు ఇంజన్ ఆగిపోయిన కారణంగా ఊపరి ఆడకపోవడంతో ఆ ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.


మృతులు బుచ్చినాయుడు కండ్రిగ, గోవిందప్ప కండ్రిగ గ్రామనికి చెందిన తిరుణం దిలీప్, పిళ్ళారి వినాయకగా గుర్తించారు. తిరుచానూరులో కార్ స్టార్ట్ చేసి అందులో కూర్చొని మద్యం సేవించారు యువకులు. అతిగా మద్యం తాగడంతో ఇద్దరు యువకులు మత్తులోకి వెళ్లిపోయారు. వీరు మద్యం సేవించే సమయంలో కారును ఆన్‌లోనే ఉంచారు. దీంతో చాలా సేపు కార్‌ను ఆన్‌లోనే ఉంచడంతో అందులోని పెట్రోల్ అయిపోవడంతో కార్ ఇంజన్ ఆగిపోయింది. అయితే మత్తులో ఉండంటంతో ఆ ఇద్దరికీ ఇవేమీ కూడా తెలియని పరిస్థితి. కారు డోర్లు లాక్ అయి ఉండటంతో ఊపిరి ఆడక ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఇద్దరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే వీరి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై తిరుచానూరు ఎస్సై సాయినాథ్ చౌదరి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్?

వైసీపీ సెటిల్‌‌మెంట్.. సీఎం చంద్రబాబు రియాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 01:28 PM