Minister Lokesh: ఆ టీచర్‌పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:03 PM
Minister Lokesh: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని కొనియాడారు.

అమరావతి, జూన్ 30: రాజాం నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) స్పందించారు. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని.. అందుకు ఆ ఉపాధ్యాయుడికి అభినందలను తెలియజేశారు మంత్రి. ఇలాంటివి చూస్తుంటే విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు.. అందులోని సమస్యలను పరిష్కరేందుకు చేసిన కష్టం మరిచిపోవచ్చంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
లోకేష్ ట్వీట్..
‘ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం .. రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం. తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు ఈ మాస్టారు. ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్ కి అభినందనలు. మన బడికి మనమే అంబాసిడర్స్ గా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్?
వైసీపీ సెటిల్‌మెంట్.. సీఎం చంద్రబాబు రియాక్షన్
Read Latest AP News And Telugu News