Special workshop: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:32 AM
Special workshop: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాపు జరగనుంది. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వరంగానికి చెందిన వారు పాల్గొంటారు.

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన సోమవారం, విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ నేషనల్ వర్క్ షాప్ (Amaravati Quantum Valley National Workshop) జరగనుంది. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) సహకారంతో క్వాంటమ్ పార్క్ నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి వారికి విందు ఇచ్చారు.
విందులో పాల్గొన్న ప్రముఖులు వీరే..
సీఎం చంద్రబాబు ఇచ్చిన డిన్నర్‌లో పాల్గొన్న ప్రముఖుల్లో టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్,కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ తదితరులు పాల్గొన్నారు.
కాగా జాతీయ స్థాయిలో ప్రప్రథమంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నుంచి మెరుపు వేగంతో కూడిన సాంకేతిక నైపుణ్యం.. క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ఇప్పటివరకు క్లాసిక్ కంప్యూటింగ్ పేరిట సంప్రదాయ కంప్యూటర్ సిస్టమ్ ప్రొగ్రామింగ్ మొత్తం.. మేథమెటిక్స్‌పైనే ఆధారపడి ఉంటోంది. అందువల్ల సమస్యలను పరిష్కరించే మేధస్సు వేగం కొంత మేరకే ఉంటోంది. కానీ వర్తమాన కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంలో మేథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీల కలయికతో కూడిన క్వాంటమ్ కంప్యూటింగ్ కాంతి వేగంతో పోటీ పడుతుంది. లక్షల మందిలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని సమాచారం కోరితే క్షణాల్లో అందించే మేధ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేక. వచ్చే ఏడాది జనవరి నుంచి లక్షల మంది అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ టెక్ పార్కు నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉంది. ఈ వ్యాలీ రాష్ట్రానికే పరిమితం కాకుండా పలు రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రభుత్వరంగ సంస్థలు వాడుకునే వీలుంది. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాపు జరగనుంది. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సాంకేతికంగా అభివృద్ధి చేసే సంస్థలు, వినియోగించేవారు, విద్యార్థులు, మేధావులు, ప్రభుత్వరంగానికి చెందిన వారు పాల్గొంటారు. క్వాంటమ్ వ్యాలీపై డిక్లరేషన్‌ను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి:
కళ్లలో కారం కొట్టి పీకపై కాలేసి తొక్కి..
జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు
For More AP News and Telugu News