Tirumala Temple: అక్టోబర్‌లో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే..
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:32 PM
అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలను టీటీడీ ప్రకటించింది. అలాగే లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం వివరాలను కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ వెల్లడించారు.
తిరుమల, నవంబర్ 7: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి (Tirumala Temple) దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తుంటారు. సెలవులు, వీకెండ్‌లలో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. గోవిందుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. గంటల పాటు నిరీక్షణ అనంతరం శ్రీనివాసుడిని కనులారా వీక్షించి భక్తులు పునీతులవుతారు. అలాగే స్వామికి వెండి, బంగారు, నగదు రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్ మాసంలో శ్రీవారిని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే వివరాలను టీటీడీ ప్రకటించింది. అలాగే లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం వివరాలను కూడా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ వెల్లడించారు.
తిరుమల శ్రీవారిని అక్టోబర్ నెలలో 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఈవో తెలిపారు. అలాగే శ్రీవారికి హుండీ ద్వారా రూ.119.35 కోట్ల ఆదాయం వచ్చింద్నారు. అక్టోబర్ మాసంలో 1.23 కోట్ల లడ్డూల విక్రయం జరిగిందని.. 34.20 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. దాదాపు 8.31 లక్షల మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
గత పాలక మండలిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఆళ్వార్ ట్యాంక్ నుంచి గోగర్భం వరకు టాయిలెట్లు ఇతర ఖర్చుల కోసం రూ.25 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయం పనులు పునః ప్రారంభించినట్లు చెప్పారు. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు వచ్చే విరాళంలో ఆలయ నిర్మాణాల కోసం రూ.750 కోట్లు కేటాయించామని తెలిపారు. ఈనెల (నవంబర్) 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు సజావుగా సాగేలా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి భక్తులకు 10వ రోజున వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని అన్నారు. టికెట్లు ఎలా ఇవ్వాలి అనే అంశం గురించి పరిశీలిస్తున్నామన్నారు. వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు ఎప్పుడు అందిస్తామనే విషయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే
ఆనందక్షణాలను సీఎంతో పంచుకున్న శ్రీచరణి
Read Latest AP News And Telugu News