Tirumala: అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం..
ABN , Publish Date - Mar 04 , 2025 | 11:16 AM
తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో పిల్లిని చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు మంగళవారం వేకువజాము 1 గంటకు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలు చూసి...

తిరుమల: అలిపిరి కాలిబాట (Alipiri Steps) మార్గంలో చిరుత సంచారం (Leopard) కలకలం (Kalakalam) రేపింది. గాలిగోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచరించినట్లు దుకాణంలోని సీసీ కెమెరా (CCTV )లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. నడక మార్గంలో కనిపించిన పిల్లిని చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు మంగళవారం వేకువజాము 1 గంటకు సీసీ కెమెరాలో దృశ్యాలు నమోదయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన దుకాణందారులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అటవిశాఖ అధికారులకు, టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
Read More..:
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు నడక మార్గంలో భక్తులను అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 2 గంటల అనంతరం భక్తులు గుంపులు గుంపులుగా వెళ్ళాలని టీటీడీ అధికారులు సూచించారు. కాగా చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు.
రెండు వారాల క్రితం కూడా తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు.. పెద్దగా శబ్దాలు చేయడంతో చిరుత వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో భక్తుల కోసం భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..
తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News