Kanipakam: అంచెలంచెలుగా మాస్టర్ ప్లాన్ అమలు
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:40 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మాస్టర్ ప్లాన్‌ను అంచెలంచెలుగా అమలు చేస్తామని దేవదాయ శాఖ సీఈ శేఖర్ తెలిపారు.

ఐరాల(కాణిపాకం), జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మాస్టర్ ప్లాన్‌ను అంచెలంచెలుగా అమలు చేస్తామని దేవదాయ శాఖ సీఈ శేఖర్ తెలిపారు. సోమవారం దేవదాయ శాఖ స్తపతి పరమేశ్వరప్పతో కలసి కాణిపాకానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఆలయ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్‌లోని పనులను పూర్తి చేస్తామన్నారు. అలాగే వారు కాణిపాకంలో నూతనంగా నిర్మిస్తున్న నూతన అన్నదాన సత్ర భవన నిర్మాణ పనులు, భక్తుల బస కోసం వినాయక సదన్ వద్ద నిర్మిస్తున్న గదుల నిర్మాణాలను పరిశీలించారు. ఆలయ పుష్కరిణి మార్పు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్, ఈఈ వెంకటనారాయణ, దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయ ఈఈ గంగయ్య, ఆలయ ఈఈ వెంకటనారాయణ, భవిరరవి, ఏఈవో రవీంద్రబాబు, ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు తదితరులు పాల్గొన్నారు.