Share News

CM Chandrababu : రాజ్యాంగ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సాధన

ABN , Publish Date - Jan 27 , 2025 | 04:49 AM

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

CM Chandrababu : రాజ్యాంగ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర సాధన

  • తన నివాసంలో జెండా ఎగరవేసిన సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌-2047, స్వర్ణాంధ్ర విజన్‌-2047ల లక్ష్య సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన వేళ భారతదేశ ప్రజలందరికీ ఎక్స్‌ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని పేర్కొన్నారు.

సృజనాత్మకతకు మారుపేరు ఏటికొప్పాక బొమ్మలు

మరోవైపు ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతమైన మన ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రధాని మోదీతో సహా ప్రముఖలందరినీ ఆకట్టుకుందని ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. పర్యావరణ హితమైన, సహజ సిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ‘బొమ్మలమ్మ .. బొమ్మలు’ అంటూ సాగే పాటతో కర్తవ్యపథ్‌లో సాగిన శకటాల పరంపరలో మన ఏటికొప్పాక బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, దీనికి కారణమైన వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 04:50 AM