Share News

P.V.N. Madhav: ఉగ్ర మూకలపై ఉక్కుపాదం మోపాలి

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:12 AM

రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా పెంచి దేశ ద్రోహులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు.

P.V.N. Madhav: ఉగ్ర మూకలపై ఉక్కుపాదం మోపాలి

  • పవన్‌పై కేసు మురుగన్‌పై దాడే: మాధవ్‌

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉగ్రవాదుల కదలికలపై మరింత నిఘా పెంచి దేశ ద్రోహులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక సాధు సంత్‌ల ఆశీర్వాదం తీసుకున్న ఆయన విజయవాడలో విలేకరులతో ముచ్చటించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏళ్ల తరబడి ఉగ్రవాదులు మారు పేర్లతో ఉంటూ అక్కడ తరచూ జరిగే హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోస్తున్నారన్న అనుమానం వ్యక్తంచేశారు.


విజయనగరం లాంటి చోట ఉగ్రవాద లింకులు పోలీసు కుటుంబాల నుంచి బయట పడటం ఆందోళనకరమన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై తమిళనాడులో కేసు నమోదుచేయడం మురుగన్‌పై దాడిగా మాధవ్‌ అభివర్ణించారు. సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యాలనే దుర్మార్గపు పాలన సాగిస్తోన్న డీఎంకే ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఆలయాలు, ఆవులపై దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Updated Date - Jul 03 , 2025 | 07:12 AM