Bapatla Accident: బాపట్లలో లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
ABN , Publish Date - Nov 06 , 2025 | 03:13 PM
బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు వైపు వెళ్తున్న బైక్.. లారీని ఢీకొన్న ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
బాపట్ల, నవంబర్ 6: జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో వేగంగా వెళ్తున్న బైక్.. లారీని ఢీకొట్టిన(Road Accident) ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు గుంటూరు జిల్లా(Guntur District) కొరిటపాడుకు చెందిన 21 ఏళ్ల షేక్ రిజ్వాన్ కాగా, మరొకరు 21 ఏళ్ల చింతల నానిగా గుర్తించారు. తొలుత ఇద్దరు యువకులు సరదాగా స్థానిక సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.
బీచ్(Surya Lanka beach) మూసివేశారని తెలియడంతో గుంటూరు వైపునకు పయనమయ్యారు. ఇంతలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది బైక్. ఈ ఘటనలో బైక్‌పైనున్న ఇద్దరు యువకులు ఒక్కసారిగా ఎగిరిపడి.. అక్కడిక్కడే మృతిచెందారు. ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..