KGF Actor Passes Away: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:47 PM
కేజీఎఫ్ చాచా అలియాస్ హరీష్ రాయ్ చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హరీష్ రాయ్ కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ సినిమాలు చేశారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చనిపోయారు. హరీష్ రాయ్ గత కొంతకాలంగా బెంగళూరులోని కిడ్వాయ్ ఆస్పత్రిలో థైరాయిడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్ కారణంగా ఆయన పొట్టపై తీవ్ర ప్రభావం పడ్డట్టు తెలుస్తోంది.
గురువారం ఉదయం హరీష్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించింది. డాక్టర్లు ఆయన్ని కాపాడాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. హరీష్ రాయ్ మృతిపై సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తమ సంతాపం తెలియజేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. హరీష్ రాయ్ అకాల మరణం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
విలన్‌గా కన్నడ నాట గుర్తింపు..
హరీష్ రాయ్ విలన్‌గా కన్నడ నాట తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శివ్ రాజ్ కుమార్ హీరోగా .. ఉపేంద్ర డైరెక్ట్ చేసిన ‘ఓం’ సినిమాలో విలన్‌గా చేశారు. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల్లో ‘చాచా’గా నటించారు. ఈ రెండు సినిమాలతో ప్యాన్ ఇండియా ఫేమ్ సంపాదించారు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా ఆయన సినిమాలు చేశారు.
ఇవి కూడా చదవండి
మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది: ద్రౌపది ముర్ము
ఈ దఫా పీఎం కిసాన్ 29 లక్షల మందికి షాకివ్వొచ్చు..