AP Govt : ఏపీహెచ్‌ఆర్‌డీఏ డీజీగా సిసోడియాకు అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Feb 18 , 2025 | 05:46 AM
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఏ) డైరెక్టర్ జనరల్‌గా ఆర్‌పీ సిసోడియాకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఏ) డైరెక్టర్ జనరల్‌గా ఆర్‌పీ సిసోడియాకు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన హెచ్‌ఆర్‌డీఏ డీజీగా పని చేశారు. కొత్త అధికారిని నియమించే వరకూ హెచ్‌ఆర్‌డీఏ విభాగం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.