AP Govt : ఆరు నెలల్లో గుడిసె నుంచి డాబాలోకి!
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:54 AM
రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి గతేడాది జూలై 1న ప్రథమంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి గతేడాది జూలై 1న ప్రథమంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాన్ని కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎస్సీ కాలనీలోని పూరిపాకలో నివసిస్తున్న పాములనాయక్ కుటుంబం దీనస్థితిని చూసి చలించిపోయారు. అదే స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని వారికి స్వయంగా చంద్రబాబు హామీ పత్రం అందజేశారు. ఆ మేరకు హౌసింగ్ స్కీమ్ కింద ఆరు నెలల్లోపే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని ఇలా సుందరంగా ముస్తాబైంది.
-ఆంధ్రజ్యోతి, తాడేపల్లి