Share News

Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:14 PM

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించింది.

 Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
Kashi Bugga temple stampede

శ్రీకాకుళం, నవంబర్ 2: కాశీబుగ్గ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి(Kashi Bugga temple stampede) కుటుంబాలకు పరిహారం చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి.. చెక్కులను అందజేశారు.


టెక్కలి నియోజకవర్గం పరిధి నందిగాం మండలం పిట్టలిసరియా, రామేశ్వరం, శివరాంపురం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం రూ.15 లక్షల చెక్కు అందజేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో రెండు లక్షల సాయం అందుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.


కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడినవారికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించింది. శనివారం మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. బాధితులకు పరిహారం ప్రకటించారు, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తామని.. వారికి అండగా ఉంటామని నారా లోకేష్ వెల్లడించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం కాశీబుగ్గ తొక్కిసలాట( Kashi Bugga tragedy) బాధితులకు పరిహారం చెల్లించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 02 , 2025 | 03:18 PM