Share News

KVNR Chakradhar Babu : గ్రీన్‌ ఎనర్జీ కేంద్రంగా ఏపీ

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:44 AM

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏపీ జెన్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.

 KVNR Chakradhar Babu : గ్రీన్‌ ఎనర్జీ కేంద్రంగా ఏపీ

  • రూ.3.92 లక్షల కోట్ల పెట్టుబడులు, 3.30 లక్షల మందికి ఉద్యోగాలు

  • ‘పీఎం కుసుమ్‌’ సౌర విద్యుత్తు కోసం1200 వ్యవసాయ ఫీడర్లు

  • ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు

అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని గ్రీన్‌ ఎనర్జీ కేంద్రంగా సమూలంగా మార్చేస్తున్నామని ఏపీ జెన్కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబాబు ప్రకటించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన విద్యుత్తు సౌధ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యుత్తు సంస్థల ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రీన్‌ఎనర్జీలో 3.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా రూ.3.92 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. లోవర్‌ సీలేరులో 115 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు హైడల్‌ పవర్‌ప్లాంట్లను 2029 నాటికి అందుబాటులోనికి తీసుకువస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటేడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 అమలు చేయడం ద్వారా రెన్యువబుల్‌ ఎనర్జీ రంగంలో ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు దక్కేలా పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. అప్పర్‌ సీలేరు వద్ద 1350 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్తు ప్లాంటును స్థాపిస్తున్నామన్నారు. పీఎం కుసుమ్‌ కింద 1200 వ్యవసాయ ఫీడర్లను సోలార్‌ కరెంటు ఫీడర్లుగా మారుస్తున్నామని చక్రధరబాబు వెల్లడించారు.

ఠాగూర్‌ రామసింగ్‌కు లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ ఠాగూర్‌ రామసింగ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందించారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ రామసింగ్‌ను ఆయన అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 05:45 AM