Kalava Srinivas : ఆవులదట్ల ఉపకాలువను వెంటనే నిర్మించాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:56 AM
హంద్రీనీవాలో అంతర్భాగమైన 36సి (ఆవులదట్ల ఉపకాలువ) ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. హంద్రీనీవా పనుల కోసం 2021 జూన 7న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 29 మేరకు రూ.6,124 కోట్ల పాలనా ఆమోదం పొందిందని అన్నారు. ఆ నిధులు అందుబాటులో ఉన్నందున తిరిగి పాలన, ఆర్థిక ఆమోదంతో ...

అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
అనంతపురం/రాయదుర్గం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవాలో అంతర్భాగమైన 36సి (ఆవులదట్ల ఉపకాలువ) ప్యాకేజీ పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. హంద్రీనీవా పనుల కోసం 2021 జూన 7న ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 29 మేరకు రూ.6,124 కోట్ల పాలనా ఆమోదం పొందిందని అన్నారు. ఆ నిధులు అందుబాటులో ఉన్నందున తిరిగి పాలన, ఆర్థిక ఆమోదంతో పనిలేకుండా 36సి ప్యాకేజీని అందులోనే కలుపుకుని పనులు వేగంగా చేపట్టాలని కోరారు. ఆవులదట్ల ఉపకాలువ పరిధిలో 10 వేల ఎకరాలకు అదనంగా సాగునీరు
అందించాల్సి ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నేమకల్లు పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు అధికారులు 36సి ప్యాకేజీ పనులకు రూ.267 కోట్లతో తాజా ప్రతిపాదనలు సిద్ధం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక చొరవతో హంద్రీనీవా పనులు పునఃప్రారంభించి, తమ జిల్లాకు ప్రాణం పోశారని కృతజ్ఞతలు తెలిపారు. హంద్రీనీవా కాలువ మధ్య హగరి నదిపై సిమెంట్ స్ట్రక్చర్ నిర్మాణానికి ఒకటిన్నర ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు. కావున పనులు మరింత ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభించాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....