Share News

International Women's Day : చదవండి.. చదివించండి

ABN , Publish Date - Mar 09 , 2025 | 12:34 AM

మహిళలు బాగా చదువుకోవాలని, తమ పిల్లలను బాగా చదివించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచించారు. కృషి, పట్టుదలతో సాధన చేసి ఎంచుకున్న రంగాలలో ఉన్నతస్థాయికి చేరాలని అన్నారు. జేఎనటీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను మహిళలు ..

 International Women's Day : చదవండి.. చదివించండి
Group photo of the Collector, MP, and MLA with women

పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరండి

మహిళలకు కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచన

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళలు బాగా చదువుకోవాలని, తమ పిల్లలను బాగా చదివించాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ సూచించారు. కృషి, పట్టుదలతో సాధన చేసి ఎంచుకున్న రంగాలలో ఉన్నతస్థాయికి చేరాలని అన్నారు. జేఎనటీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాల్య వివాహాల నియంత్రణ, మహిళల ఆరోగ్యాన్ని కాపాడటాన్ని సవాలుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళల జోలికి వస్తే ఉపేక్షించవద్దని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పలుమార్లు సూచించారని, ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

చంద్రబాబు ఆదర్శం: పరిటాల సునీత

తన భర్త పరిటాల రవీంద్రను పొట్టనపెట్టుకున్న దుర్మార్గుల నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఒక మహిళగా నిర్ణయించుకున్నానని, కానీ చంద్రబాబు స్ఫూర్తితో రాజకీయాలలో నిలబడగలిగానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. తనకు చంద్రబాబు పెద్దన్నగా వెన్నంటి నిలిచారని, వంటింటికి పరిమితమైన తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించి, మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాలంబన, మహిళా సాధికారత సాధన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆశా, అంగనవాడీలతో పాటు మహిళా


ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వరాలు కురిపించారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20లక్షల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు పంపిణీ చేయనున్నారని తెలిపారు. క్యాన్సర్‌తో ఏ ఒక్క మహిళా మరణించకూడదని, ఆ దిశగా రెండు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. సోషల్‌ మీడియా, సెల్‌ఫోన్లతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మహిళలను గౌరవించే ప్రభుత్వం: బండారు శ్రావణిశ్రీ

మహిళలను గౌరవించే ప్రభుత్వంలో ఉండటం తనకు స్ఫూర్తి కలిగిస్తోందని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మహిళా పక్షపాతిగా సీఎం చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలను చంద్రబాబు కల్పిస్తున్నారని అన్నారు. చంద్రబాబు విజన తనకు స్ఫూర్తి అని అన్నారు. ఆడబిడ్డల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని కోరారు.

మహిళా పక్షపాతి చంద్రబాబు: అంబికా

డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని, ఆయన మహిళా పక్షపాతి అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మహిళను దేవతగా భావించి, గౌరవించే దేశంలో జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. మహిళామూర్తుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీ మేరకు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.

మహిళా శక్తి గొప్పది: గిరిజమ్మ

ప్రపంచంలో మహిళాశక్తి అత్యంత గొప్పదని జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ అన్నారు. తాను మహిళను అయినందుకు ఎంతో గర్విస్తున్నానని అన్నారు. విమానాలు, రైళ్ళు, సముద్రాల్లో స్టీమర్లు నడిపే స్థాయికి మహిళలు ఎదిగారని, రాకెట్లు ప్రయోగించే శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని అన్నారు. మహిళలు, విద్యార్థినుల రక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న అనంత ఆత్మరక్షణ కార్యక్రమాన్ని ఆమె అభినందించారు. మహిళల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కాపాడాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులు నియంత్రణకు చట్టాలను మరింత కఠినత రం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

అలరించిన వేడుకలు

మహిళా దినోత్సవంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మహిళల ఆత్మరక్షణ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. శాఖల స్టాల్స్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.101.13 కోట్లు, పీఎంఏజేఏవై కింద రూ.1.07 కోట్లు, స్త్రీనిధి కింద రూ.12.78 కోట్లు, ముద్ర రుణాలు రూ.3.60 కోట్లు, మెప్మా సం ఘాలకు రూ.17.76 కోట్లు, హ్యాండ్‌లూమ్‌ కింద రూ.12.75 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్‌ చైర్మన పూల నాగరాజు, ప్రశాంతి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు


సుశీలమ్మ, ఎస్సీ కార్పొరేషన డైరెక్టర్‌ కమలమ్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, డీఆర్వో మలోల, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ రామకృష్ణా రెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, జేఎనటీయూ వీసీ సుదర్శనరావు, రిజిసా్ట్రర్‌ కృష్ణయ్య, తహసీల్దారు హరికుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, డీఆర్‌డీఏ-వెలుగు పీడీ ఈశ్వరయ్య, జిల్లా సహకార శాఖ అధికారి అరుణకుమారి, హౌసింగ్‌ పీడీ శైలజ, డీఎంహెచఓ ఈబీ దేవి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రాధిక, ఎల్‌డీఓ నర్సింగారావు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, బీసీ కార్పొరేషన ఈడీ సుబ్రహ్మణ్యం, డీఎస్పీ మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

సమానత్వంతో జాతి మనుగడ

జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌

అనంతపురం క్రైం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): జాతి మనుగడకు స్ర్తీ, పురుష సమానత్వం ముఖ్యమని జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌ అన్నారు. నగరంలోని జిల్లా కోర్టులో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌, కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం ఎలా ఆవిర్భవించిందనేది వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం మహిళలకు ఉంటుందన్నారు, సమాజంలో మహిళల ప్రాముఖ్యతను తెలియజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... మహిళా సాధికారతకు జిల్లా యంత్రాంగం సహకారం అందిస్తుందని అన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా 300 మంది పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు బాలాకుమారి, ప్రసూన, మాధవి, పవిత్ర, మాధుర్య, రాణి ఐశ్వర్య, అక్బర్‌, శివప్రకా్‌షరావు, మహమ్మద్‌ ఆరి్‌ఫను, ఇతర జ్యుడీషియల్‌ అధికారులను, మహిళలను జిల్లా న్యాయాధికారి, కలెక్టర్‌ సన్మానించారు. కార్యక్రమంలో ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ర్టిక్ట్‌ కోర్టు నాయాధికారి సత్యవాణి, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు గురుప్రసాద్‌, బార్‌కౌన్సిల్‌ మెంబర్‌ రామిరెడ్డి, మహిళా కోర్టు న్యాయాధికారి శోభారాణి, పోక్సో కోర్టు న్యాయాధికారి రాజ్యలక్ష్మి, ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి సాధుబాబు, సీనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి నిర్మల, ఎక్సైజ్‌ కోర్జు న్యాయాధికారి పావని, మొబైల్‌ కోర్టు న్యాయాధికారి సుధీర్‌కుమార్‌, స్పెషల్‌ మెజిస్ర్టేట్‌ సుబ్బారావు, శివశంకర్‌, రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి రమ్య, కన్జ్యూమర్‌ ఫోరం ప్రెసిడెంట్‌ శ్రీలత, ఫోరం సభ్యురాలు గ్రేస్‌మేరీ, సీనియర్‌ అడ్వకేట్‌ పద్మజ, జ్యుడీషియల్‌ అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ భాగ్యలక్ష్మి, కోర్టు మేనేజర్‌ మాధవీలత పాల్గొన్నారు.

లోక్‌ అదాలత...

జాతీయ లోక్‌అదాలతను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌, ఎస్పీ జగదీష్‌ పాల్గొన్నారు. జాతీయ లోక్‌ అదాలతను ఉపయోగించుకోవాలని జిల్లా న్యాయాధికారి తెలిపారు. వీలైనన్ని కేసులు లోక్‌అదాలతలో రాజీ అయ్యేలా చూడాలని సూచించారు.

సమాజంలో మహిళల పాత్ర కీలకం: ఎస్పీ

అనంతపురం క్రైం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళల పాత్ర కీలకమని, జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేశామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీస్‌ కాన్ఫరెన్స హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత దిశగా పయనిస్తుండటం హర్షణీయం అన్నారు. మహిళల భద్రతలో భాగంగా ప్రతి పోలీ్‌సస్టేషనలో ఉమెన హెల్ప్‌ డెస్క్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా వారి బాధలు చెప్పుకునేలా ఇవి తోడ్పాటు అందిస్తున్నాయన్నారు. మహిళా సాధికారత వారోత్సవాల్లో వ్యాసరచన, పెయింటింంగ్‌, వక్తృత్వపు పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సప్తగిరి సర్కిల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు మహబూబ్‌బాషా, శ్రీనివాసరావు, నీలకంఠేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవం

అనంతపురం అర్బన, మార్చి 8(ఆంధ్రజ్యోతి): నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, మాజీ మేయర్‌ స్వరూప, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన పలువురు తెలుగు మహిళలతో కలిసి కేక్‌ కట్‌ చేసి, సంబరాలు చేసుకున్నారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో కురుబ నారాయణస్వామి, తెలుగు మహిళలు మణెమ్మ, వసుంధర, లక్ష్మీనాయుడమ్మ, రహ్మతబీ, వడ్డే సరళ, శకుంతమ్మ, గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.


మ‌రిన్ని అనంత‌పురం వార్త‌ల కోసం...

Updated Date - Mar 09 , 2025 | 12:34 AM