Cancer Unit : క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం..!
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:44 AM
జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ యూనిట్‌ను అధునాతనంగా నిర్మిం చి, అత్యాధునికంగా వైద్య సేవలు అందించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం వైద్యఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టరు రమే్‌షబాబు, న్యూఢిల్లీకి చెందిన ...

యూనిట్‌ను పరిశీలించిన నిపుణులు
అత్యాధునికంగా.. డిజైన
అనంతపురంటౌన, మార్చి 5(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని క్యాన్సర్ యూనిట్‌ను అధునాతనంగా నిర్మిం చి, అత్యాధునికంగా వైద్య సేవలు అందించడానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం వైద్యఆరోగ్యశాఖ రాష్ట్ర నోడల్ అధికారి డాక్టరు రమే్‌షబాబు, న్యూఢిల్లీకి చెందిన నొక్డావో పొల్యూషన్స ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెంట్ ప్రతినిధి ప్రభంజనసేథ్ జిల్లాకు వచ్చారు. శారదానగర్‌లో ఉన్న క్యాన్సర్ యూనిట్‌ను పరిశీలించారు. అక్కడ పక్కనే ఉన్న స్థలంలో అధునాతన క్యాన్సర్ యూనిట్ నిర్మాణానికి సంబంధించి డిజైనను
ఈబృందం రూపొందించింది. అనంతరం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు మాణి క్యాలరావుతో కలిసి చర్చించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడు తూ అత్యాధునిక క్యాన్సర్ యూనిట్ నిర్మాణంతో పాటు చికిత్స పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటు న్నారన్నారు. ప్రధానంగా లీనియర్ యాక్సిలరేటర్, హెచడీఆర్ బ్రాకీ థెరఫీ యూనిట్, సిటీసిమ్యులేటర్, డోసిమెట్రీ ఎక్వి్‌పమెంట్, మోల్డ్‌రూమ్ ఎక్వి్‌పమెంట్, సర్జికల్ అంకాలజీ, మెడికల్ విభాగాలకు అవసరమైన పరికరాలు, అత్యాధునిక ఆపరేషన థియేటర్, బయోసేఫ్టీ క్యాబినెట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కమిటీబృందం జిల్లాకు వచ్చిందన్నారు. ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లు ఇక్కడ స్థలం లేఅవుట్ ప్ల్లానను ఇచ్చారని, దాని ప్రకారం ఆర్కిటెక్చరల్ డిజైనలు ఒకనెలలో సిద్ధం చేసి అనుమతి కోసం పంపుతామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టరు వెంకటేశ్వరరావు, క్యాన్సర్ విభాగం హెచఓడీ డాక్టరు సతీ్‌షకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టరు ప్రశాంతి, ఏపీఎంఎ్‌సడీడీసీ ఇంజనీర్లు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...