Miniser Kollu Ravindra: ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:30 PM
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.

అనంతపురం: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లో ఢిల్లీ (Delhi)కి మించిన లిక్కర్ స్కామ్ (Liquor scam) జరిగిందని... ఈ కేసులో బాధ్యులు ఎవరూ తప్పించుకోలేరని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Miniser Kollu Ravindra) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా గురువారం ఆయన అనంతపురం (Anantapuram)లో మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ (SIT) పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి మద్యం పాలసీ (Liquor policy) అమలు చేస్తున్నామన్నారు. గత వైసీపీ (TCP) పాలనలో లక్ష కోట్లు నాన్ డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) జరిగాయని... ఇప్పుడు 52 శాతం డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయని, ఏపీ బార్డర్స్‌లో మద్యం విక్రయాలు బాగా పెరిగాయన్నారు. దీని వలన రాష్ట్రానికి ఆదాయం భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు.
Also Read..: టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..
బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో పోలీసుల్ని బట్టలూడదీస్తానంటూ వ్యాఖ్యలు చేశారని, టీడీపీ నేతల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని అన్నారు. జగన్ పోలీసుల ప్రతిష్టను, ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, వాళ్లు అధికారంలోకి వస్తే తలలు తీస్తామని ఓ మాజీ మంత్రి (కారుమూరి నాగేశ్వరరావు) అంటున్నారని, ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
లిక్కర్ మాఫియాను వదిలిపెట్టం..
గత ఐదేళ్ల కాలంలో జగన్ జమానాలో సాగిన లిక్కర్ మాఫియా కేసులో ఎవరినీ వదలి పట్టేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మద్యంలో జరిగిన అవినీతి అక్రమాలను ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ.లక్ష కోట్లు లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతోందని తెలిపారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్.. మద్యం వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి, నూతన విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకాణీకి లుక్ అవుట్ నోటీసులు..
Online Betting Games.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీ తాజా స్పందన
For More AP News and Telugu News