Anjanna : అంజన్న వైభవం
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:53 AM
కుందుర్పి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్డీపాలెం గ్రామంలో వెలిసిన గుడిబండ ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 11 ...

కుందుర్పి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్డీపాలెం గ్రామంలో వెలిసిన గుడిబండ ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 11 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య రథోత్సవం ప్రారంభమైంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తుడు.. రథోత్సవంపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. వేలాదిమంది భక్తులు.. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల నుంచి తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.