Share News

Call Money Harassment: అప్పు చెల్లిస్తారా లేక మేము.. కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:27 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాల్ మనీ అరాచకాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆకృత్యాలు వెలుగుచూశాయి. అనంతపురం నగరంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారి బాబ్ జాన్‌ను వడ్డీ వ్యాపారులు చితకబాదారు.

Call Money Harassment: అప్పు చెల్లిస్తారా లేక మేము.. కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు
Call Money Scam Harassment

అనంతపురం: ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లాలో కాల్ మనీ అరాచకాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి (Call Money Scam Harassment). మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వెలుగుచూశాయి వడ్డీ వ్యాపారుల ఆకృత్యాలు. అనంతపురం నగరంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారి బాబ్ జాన్‌ను చితకబాదారు వడ్డీ వ్యాపారులు. రూ.2 లక్షల అప్పుకు నెలకు రూ. 20 వేల వడ్డీ చెల్లించారు వ్యాపారి బాబ్ జాన్. ధర్మవరంలో వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై దాడి చేశారు వడ్డీ వ్యాపారి అనుచరులు.


వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా నుంచి రూ.6 లక్షలు అప్పు తీసుకున్నారు పట్టు చీరల వ్యాపారం చేస్తున్న రమణ. వ్యాపారం కోసం వారానికి రూ.10ల వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నారు రమణ. మూడు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో ఈనెల(జులై) 23వ తేదీన పట్టు చీరల వ్యాపారి రమణ ఇంటిపైకి వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా దాడికి వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి రమణతోపాటు భార్య భారతిపై విచక్షణ రహితంగా దాడి చేశారు వడ్డీ వ్యాపారి అనుచరులు. తల్లిదండ్రులను కొడుతుండటంతో అడ్డుగా వెళ్లిన కుమారుడు చరణ్ సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు వడ్డీ వ్యాపారి అనుచరులు. వారు లక్షలు అప్పు తీసుకొని రూ.15 లక్షలు వడ్డీ కట్టినా.. మరో రూ. 6 లక్షల ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ రమణ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

రాష్ట్రంలో పాజిటివ్‌ గవర్నెన్స్‌: మంత్రి సత్యప్రసాద్‌

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 01:32 PM