Share News

Bear : రోడ్డుపైకి ఎలుగుబంటి

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:44 AM

పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ కాలనీ వద్ద రోడ్డుపై రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్‌చల్‌ చేస్తోంది. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందారు. సమీపంలో వున్న కురాకుల గుట్ట నుంచి వచ్చి రోడ్డు మీద సంచరిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఆదివారం పగలే రోడ్డుపైకి రావడంతో పరిసర ప్రాంత...

Bear : రోడ్డుపైకి ఎలుగుబంటి
A bear wandering on the road

రాయదుర్గం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని రాజీవ్‌గాంధీ కాలనీ వద్ద రోడ్డుపై రెండ్రోజులుగా ఎలుగుబంటి హల్‌చల్‌ చేస్తోంది. శనివారం రాత్రి ద్విచక్రవాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందారు. సమీపంలో వున్న కురాకుల గుట్ట నుంచి వచ్చి రోడ్డు మీద సంచరిస్తున్నట్లు కాలనీవాసులు


చెబుతున్నారు. ఆదివారం పగలే రోడ్డుపైకి రావడంతో పరిసర ప్రాంత ప్రజలు పరుగులు పెట్టారు. అరగంటపాటు రోడ్డుపై సంచరించిన ఎలుగుబంటి తర్వాత గుట్టల్లోకి వెళ్లిపోయినట్లు కాలనీవాసులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కొండ ప్రాంతాన్ని పరిశీలించి, కాలనీ వాసులకు పలు సూచనలు ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


Updated Date - Mar 03 , 2025 | 12:44 AM