Operation Sindoor:మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - May 11 , 2025 | 11:06 AM
Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా: వీర జవాన్ (Agniveer Jawan) మురళీ నాయక్ (Murali Naik) స్వగ్రామం కిళ్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వచ్చారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.
కాగా శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో అమర జవాను అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వం నిర్వహించనుంది. గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. కాగా అంతకుముందు పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంకు చేరుకున్న ఆయనకు జనసేన పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వాగతం పలికారు. పవన్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో కళ్లితండాకు వచ్చారు.
Also Read:
TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలు
దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ పార్థివదేహానికి ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చముంచి నివాళులర్పించారు . ఆదివారం ఉదయం మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండా గ్రామానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఈ మేరకు నివాళులు అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిలను మంత్రి లోకేష్ ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఎంపీ బీకే పార్థసారథి తదితరులు ఉన్నారు. అలాగే ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రజా నాయకులు మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వీరజవాన్ మురళీ నాయక్‌కు లోకేష్ నివాళి
మోహినీ అలంకరణలో చిన్న వెంకన్న..
For More AP News and Telugu News