MLA Sunitha: రాప్తాడుకు బంగారు భవిష్యత్తు..
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:07 PM
రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు.
- సీఎం చంద్రబాబు చొరవతోనే రేమండ్స్ రాక
- ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు(అనంతపురం): రేమండ్స్ పరిశ్రమ రాకతో రాప్తాడు భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయని ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Paritala Sunitha) అన్నారు. జాకీ పరిశ్రమ స్థానంలో రేమండ్స్ వస్త్ర పరిశ్రమ మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజనప్ప, ధర్మవరం నియోజకవర్గం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ హాజరయ్యారు.
ఈసందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంకు సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు సహకారంతో రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వం దాన్ని విస్మరించిందన్నారు.

అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, అతడి సోదరుల వసూళ్ల ప్రయత్నం కారణంగా జాకీ రాప్తాడును వదిలిపోయిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే అదే కంపెనీ లేక ఇతర కంపెనీలను తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశామన్నారు. ఆ మేరకు ప్రముఖ వస్త్ర కంపెనీ రేమండ్స్ రూ.497కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. పరిశ్రమ ఏర్పాటైతే 4వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News