Share News

Rajagopal Reddy: బీఆర్‌ఎస్‌ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సే

ABN , Publish Date - Dec 20 , 2024 | 04:57 AM

బీఆర్‌ఎస్‌ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లచొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫారాలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.

Rajagopal Reddy: బీఆర్‌ఎస్‌ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సే

  • ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ నేతలకు మిగిలేది జైలు డ్రెస్సేనని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లచొక్కాలు, ఆటో డ్రైవర్ల యూనిఫారాలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో లాబీలోకి వచ్చిన బాల్క సుమన్‌... ఇన్నర్‌ లాబీలోకి మాజీ ఎమ్మెల్యేలకు అనుమతి లేదంటూ అతికించిన బోర్డులను చూపిస్తూ అన్యాయమని రాజగోపాల్‌తో అన్నారు. ‘‘మీరు అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుని.. మమ్మల్ని లాబీ అవుతల పడేసిండ్రు. మా సీఎం రేవంత్‌ మంచోడు కాబట్టి బీఆర్‌ఎస్‌ బతికిపోతోంది. నాలాంటోడు అయితే మీ పార్టీ పని అయిపోయేది’’ అని రాజ్‌గోపాల్‌ అనడంతో.. సుమన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


ఎన్టీఆర్‌ అంటే నాకు గౌరవం: రాజగోపాల్‌ రెడ్డి

ఎన్టీఆర్‌ అంటే తనకు ఎనలేని గౌరవమని, ఆయన లెజండరీ నాయకుడని రాజగోపాల్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ విషయంలో తాను అనని మాటల్ని అన్నట్లుగా దుష్ప్రచారం చేశారని, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తెలిపారు. తన ఎదుగుదలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని, ఇలాంటివి పునరావృతం కానివ్వొద్దని మీడియాను కోరారు.

Updated Date - Dec 20 , 2024 | 04:57 AM