Hyderabad: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:11 AM
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు.

పైలట్ ప్రాజెక్టుగా మొదటి బ్యాచ్
గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో ఎంపిక ప్రక్రియ
44 మంది ఎంపిక.. నేటి నుంచి శిక్షణ
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గట్టెక్కడానికి, సిబ్బందిని కొరతను అధిగమించడానికి, ట్రాఫిక్ నియంత్రణ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ల నియామకాలను ఉన్నతాధికారులు వేగవంతం చేశారు. మహిళా శిశు సంరక్షణ విభాగం కార్యదర్శి అనితా రామచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాన్స్‌జెంటర్లను ట్రాఫిక్ విధుల్లోకి తీసుకునే విషయంపై కసరత్తు చేసి పైలట్ ప్రాజెక్టుగా మొదటి బ్యాచ్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో ట్రాన్స్‌జెంటర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఎంపికకు అవసరమైన ఈవెంట్స్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ సీపీ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 58 మంది ట్రాన్స్‌జెండర్స్ ఈవెంట్స్‌కు హాజరుకాగా 44 మంది ఉద్యోగానికి అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం వారికి యూనిఫామ్స్ అందజేసి ట్రాఫిక్ శిక్షణ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ ముగిసిన అనంతరం వారిని విఽధుల్లోకితీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులు నిర్వర్తిస్తున్న తరహాలోనే ట్రాన్స్‌జెండర్స్ ట్రాఫిక్ అసిస్టెంట్స్‌కు విధులు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.