BJP: బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే ఆర్‌ఎస్ ప్రవీణ్ తాపత్రయం..
ABN , Publish Date - Dec 10 , 2024 | 12:31 PM
బీనామీ పేర్ల మీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) తాపత్రయ పడుతున్నారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధీరజ్‌రెడ్డి, జంగయ్యయాదవ్, కార్పొరేటర్ రంగానర్సింహగుప్తా, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌లు అన్నారు.

బీజేపీ నేతలు
హైదరాబాద్: బీనామీ పేర్ల మీద ఉన్న కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) తాపత్రయ పడుతున్నారని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధీరజ్‌రెడ్డి, జంగయ్యయాదవ్, కార్పొరేటర్ రంగానర్సింహగుప్తా, ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌లు అన్నారు. ఆర్‌కేపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీనామీలపేరిట కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారని వాటిని కాపాడుకునేందుకే హనుమయ్య వ్యక్తిగత విషయానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Congress: తెలంగాణలో మరో తొమ్మిదేళ్లు ప్రజాపాలన ఖాయం..
అనేక మంది పెద్దపెద్ద కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనుమయ్య బీఆర్‌ఎస్ నాయకుడే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బినామీ అని అన్నారు. మర్రిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో సుమారు 750 ఎకరాల స్థలం, యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో సుమారు 90 ఎకరాల స్థలం హనుమయ్య అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని తెలిపారు. ఆయా భూములు కూడా దళితులను, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేసి, మోసం చేసి లాక్కున్నారని ఆరోపించారు.
హనుమయ్య భూములు లాక్కోవడంతో కొందరు ఆత్మహత్య కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బినామీ కావడం వల్లే హనుమయ్య అతని కుటుంబ సభ్యుల పేరిట వందలాది ఎకరాల స్థలాలు ఉన్నాయన్నారు. ధీరజ్‌రెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి హనుమయ్యకు తనతో నేరుగా ఎలాంటి సంబంధం లేదన్నారు. రెండు రోజుల క్రితం హనుమయ్య తన అనుచరులతో కలిసి మా కార్యాలయానికి వచ్చి నాపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.
అనేకసార్లు హనుమయ్య నాకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. వ్యాపార లావాదేవిలకు సంబంధించిన విషయంలో ప్రవీణ్‌కుమార్ ఆగమేఘాల మీద వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తు తన బినామీలను కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారిగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ నిజానిజాలు తెలుసుకోకుండానే కేవలం బినామీల పేరిట ఉన్న ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News