CPI State Secretary K. Ramakrishna : అదానీ ఒప్పందాన్ని రద్దు చేసేవరకు పోరాటం
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:37 AM
అదానీ సంస్థలతో జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

అమిత్‌షా రాజీనామా డిమాండ్‌తో 30న నిరసనలు: రామకృష్ణ
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): అదానీ సంస్థలతో జగన్ ప్రభుత్వం చేసుకున్న సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసేవరకు వామపక్షాల పోరాటం కొనసాగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం విజయవాడలోని దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న చిన్న అంశాలకే స్పందించే సీఎం చంద్రబాబు ఇంత పెద్ద కుంభకోణంపై స్పందించడానికి భయపడుతున్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ను పార్లమెంటు సాక్షిగా అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 30న రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ శత వార్షికోత్సవాల పోస్టర్‌ను రామకృష్ణ ఆవిష్కరించారు.