TS NEWS: పరకాల వ్యవసాయ మార్కెట్లో జేబు దొంగల హల్‌చల్
ABN , First Publish Date - 2023-09-20T18:23:10+05:30 IST
జిల్లాలోని పరకాల(Parakala) మండలంలోని వ్యవసాయ మార్కెట్లో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఈరోజు పరకాల వ్యవసాయ మార్కెట్(Agricultural market) ప్రమాణ స్వీకారం ఉండడంతో టీఆర్ఎస్ నేతలు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు.

హనుమకొండ: జిల్లాలోని పరకాల(Parakala) మండలంలోని వ్యవసాయ మార్కెట్లో జేబు దొంగలు హల్‌చల్ చేశారు. ఈరోజు పరకాల వ్యవసాయ మార్కెట్(Agricultural market) ప్రమాణ స్వీకారం ఉండడంతో టీఆర్ఎస్ నేతలు కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు. ఇదే అదునుగా భావించిన దొంగలు చేతులకు పని చెప్పారు. బీఆర్ఎస్ నేతల(BRS leaders) జేబులకు చిల్లు పెట్టారు. ఆయా నేతల వద్ద నుంచి సుమారుగా లక్ష రూపాయలు వరకు దొంగలు అపహరించినట్లు తెలుస్తోంది. పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోఈ ఘటన చోటుచేసుకుంది.ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభా వేదికపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. పోలీసులు బారీ బందోబస్తు చేపట్టిన దొంగలను పట్టుకోవడంలో విఫలం అయ్యారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.