Home » Kavali
Pawan on Pahalgam Attack: ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జరిగిందో వారు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్‌తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.
Andhrapradesh: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈరోజు (మంగళవారం) పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
Andhrapradesh: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూల్ బస్సులో పది మంది విద్యార్ధులకు గాయాలయ్యాయి. మరో అయిదుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.
కావలి(Kavali)లో అక్రమ లేఅవుట్లపై అధికారులు ఉక్కపాదం మోపుతున్నారు. వైసీపీ(YSRCP) హయాంలో జిల్లావ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు(Illegal Layout) భారీగా వెలిశాయి. ఖాళీగా కనిపించిన ప్రైవేటు, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు, వారి అనుచరులు వదిలిపెట్టలేదు.
ఎన్నికల విధుల కోసం ఊరుగాని ఊరొచ్చిన తల్లీకొడుకును రైలు రూపంలో వచ్చిన మృత్యువు పొట్టనపెట్టుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం పట్టాలు దాటుతున్న తల్లీకొడుకును రైలు వేగంగా ఢీకొనడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వాలంటీర్లతో రహస్యంగా భేటీ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కావలి శివారులో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డికి చెందిన స్కూల్ అందుకు వేదిక అయింది. సీఎం జగన్ భోజన విరామ సమయంలో వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పని చేయాలంటూ ఈ సందర్భంగా వాలంటీర్లకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.