Share News

Kavali CI Overaction: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు.. ప్రజల ఆగ్రహం

ABN , Publish Date - May 23 , 2025 | 04:42 PM

Kavali CI Overaction: జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్‌ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు.

Kavali CI Overaction: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు.. ప్రజల ఆగ్రహం
Kavali CI Overaction

నెల్లూరు, మే 23: కావలి టూ టౌన్ సీఐ గిరిబాబు (CI Giribabu) ఓవరాక్షన్ చేశారు. పైలాన్ విధ్వంసం కేసులో విచారణకు హాజరైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్ రెడ్డికి (YSRCP Leader Ramireddy Pratap Kumar Reddy) సీఐ రాచమర్యాదలు చేశారు. విచారణ నిమిత్తం రామిరెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో రామిరెడ్డి కారు వద్దకు వెళ్లిన సీఐ.. ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికి స్వయంగా వెంటబెట్టుకుని స్టేషన్‌ లోపలికి వెళ్లారు. దీంతో సీఐ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల తీరు చూస్తే విచారణ ఎలా పారదర్శకంగా సాగుతుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి... కొంత మందితో కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం పైలాన్‌ను విధ్వంసం చేశారు. ఈ కేసులో రామిరెడ్డి ఏ8 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు రామిరెడ్డి. ఇదిలా ఉండగా పైలాన్ ధ్వంసం కేసులో విచారణకు రావాల్సిందిగా రామిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ కేసుకు విచారణ అధికారిగా సీఐ గిరిబాబు ఉన్నారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న రామిరెడ్డి విచారణ నిమిత్తం ఈరోజు (శుక్రవారం) టూ టౌన్ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. ఆయన వచ్చిన విషయం తెలిసిన వెంటనే సీఐ గిరిబాబు పరుగులు తీసుకుంటూ కారు వద్దకు వెళ్లి రామిరెడ్డికి నమస్కారాలు పెడుతూ, రాచమర్యాదలు చేస్తూ వెంటబెట్టుకుని మరీ పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకొచ్చారు. ఈ సన్నివేశాలు ఇప్పుడు కావాలిలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఒక విచారణాధికారిగా ఉన్న సీఐ గిరిబాబు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేకు రాచమర్యాదలు చేయడంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. వైసీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కావాలికి వచ్చిన సమయంలో పోలీసులు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి గుడ్డలూడదీస్తామని, కాలర్‌ పట్టుకుంటామంటూ అవమానకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసుల తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా.. పైలాన్ విధ్వంసం కేసులో 12 మంది నిందితులుగా ఉండగా వారిలో నలుగురు రిమాండ్‌లో ఉన్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. రామిరెడ్డి ఒక్కరే ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి

Covid 19: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:56 PM