Pawan on Pahalgam Attack: అలా అడిగి మరీ చంపారంటే ఎంతటి దారుణం.. ఉగ్రదాడిపై పవన్
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:55 PM
Pawan on Pahalgam Attack: ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జరిగిందో వారు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

నెల్లూరు, ఏప్రిల్ 24: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgam Attack) ప్రాణాలు కోల్పోయిన మధుసూదనరావుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) నివాళులర్పించారు. గురువారం కావలి చేరుకున్న పవన్.. నేరుగా మధుసూదనరావు ఇంటికి వెళ్లి.. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆపై కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కాశ్మీర్‌లో కిరాతకంగా తూటాలు పేలిస్తే, దేశ వ్యాప్తంగా మధుసూదనరావుకు నివాళులర్పించారన్నారు. ఈ సంఘటనను కుటుంబ సభ్యులు ఇంకా నమ్మలేకపోతున్నారని తెలిపారు. వారితో మాట్లాడినప్పుడు... ఆయన భార్య, పిల్లలు ఏం జరిగింది.. ఎలా జరిగిందో చెప్పారన్నారు.
వాళ్లు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని మండిపడ్డారు. తాను మాట్లాడలేక పోతున్నానని.. రేపో, ఎల్లుండో మంగళగిరిలో ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు. రేపు (శుక్రవారం) వైజాగ్ కూడా వెళుతున్నానని చెప్పారు. ఎంత శాడిస్టికల్‌గా, మెతడాలికల్‌గా, కోల్డ్ బ్లెడెడ్‌గా చంపేశారన్నారు. కాశ్మీర్ రెండేళ్లుగా ప్రశాంతంగా ఉందనే ఇంతటి దారుణానికి, కిరాతకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. సమ్మర్‌లో షూటింగ్ కోసం కాశ్మీర్‌కు చాలా సార్లు వెళ్లానని.. అక్కడ పరిస్థితులు తనకు తెలుసన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పవన్ వెంట మంత్రులు ఆనం, నాదెండ్ల, సత్యకుమార్, ఎమ్మెల్యేలు కావ్యా కృష్ణారెడ్డి, సోమిరెడ్డి, ఆర్ఎస్ఎస్ జాతీయనేత మధుకర్ ఉన్నారు.
IG Chandrasekhar: ఆ ఆపరేషన్‌తో తెలంగాణకు సంబంధం లేదు
కాగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రమూకల దాడిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూదన్‌రావు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డ మధుసూదన్ ఫ్యామిలీతో కలిసి పహల్గామ్ విహారాయత్రకు వెళ్లారు. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అతడు మృతిచెందాడు. బుధవారం రాత్రి మధుసూదన్ మృతదేహాన్ని చెన్నై ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లా కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీమున్నీరుగా విలపించారు. ఇక పెహల్గామ్ ఉగ్రదాడిలో మరో ఏపీ వాసి కూడా ప్రాణాలు కోల్పోయాడు. విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉగ్రమూకల దాడిలో మృతిచెందాడు.
ఇవి కూడా చదవండి
PSR Prisoner Number: జైలులో పీఎస్‌ఆర్ ప్రత్యేక అభ్యర్థన.. ఏంటంటే
Nellore Police High Alert: నెల్లూరుపై ఉగ్రనీడలు.. పోలీసుల అలర్ట్
Read Latest AP News And Telugu News