Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృత దేహం..
ABN , Publish Date - Apr 24 , 2025 | 08:13 AM
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

నెల్లూరు: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెహల్గామ్ (Pahelgam)లో ఉన్మాద ఉగ్రవాదుల చేతులో (Terror Attack) కావలి (Kavali)కి చెందిన మధుసూధనరావు (Madhusudhan Rao) హతమయ్యారు. దీంతో ఆనాలవారి వీధిలోని మధుసూదనరావు నివాసం వద్ద విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. దూరప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, సన్నిహితులు భారీ సంఖ్యలో కావలికి తరలి వస్తున్నారు. మధుసూధనరావు ఇక లేరనే వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా కాశ్మీర్ నుంచి చెన్నైకు వచ్చి ఆయన పార్థివ దేహం మరికాసేపట్లో కావలికి చేరుకోనుంది. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్టణానికి చెందిన ఏపీ తెలుగు సంఘం సభ్యుడు జేఎస్ చంద్రమౌళి (Chandramouli) కూడా ప్రాణాలు కోల్పోయారు.
Also Read..: తుపాకీ లాక్కోబోయి.. తూటాలకు బలైపోయి..
సీఎం చంద్రబాబు సంతాపం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రమౌళి, మధుసూదన్‌లకు సంతాపం తెలిపారు. ఈ తీవ్ర దుఃఖ సమయంలో తమ ఆలోచనలు, ప్రార్థనలు వారి కుటుంబాలకు అండగా ఉన్నాయని, ఈ అపారమైన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారు పొందాలని తాను ప్రార్థిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మచ్చ అని చెప్పారు.
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది..
కశ్మీర్‌లోని పెహెల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి మృతదేహానికి ఆయన బుధవారం రాత్రి నివాళులర్పించారు. విశాఖ ఎయిర్‌పోర్టు ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోడియంపై ఉంచిన మృతదేహంపై స్వయంగా జాతీయ పతాకాన్ని కప్పారు. చంద్రమౌళి తోడల్లుడు కుమార్‌రాజా, బావమరిది బీఎస్ నాగేశ్వరరావుతో పాటు ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడి, కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. అంతిమయాత్ర వాహనం ముందు నడుస్తూ నిర్వహించిన శాంతి ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులను దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రదాడి దిగ్ర్భాంతి కలిగించింది: బాబు
For More AP News and Telugu News