Home » Jairam Ramesh
మోదీ గత మార్చిలో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం చర్చించేందుకు వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. అయితే మోదీ రిటైర్మెంట్ ఊహాగానాలను 2023లోనే కేంద్రం హోం మంత్రి అమిత్‌షా తోసిపుచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మూడు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
హింసాకాడంతో అట్టుడికిన మణిపూర్‌లో గత 22 నెలల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 60,000 మంది నిరాశ్రయులై సహాయ, పునరావస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జైరామ్ రమేష్ శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
శామ్ పిట్రోడా వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని, ఆయన మాటలు పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వివరణ ఇచ్చారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. ముఖ్యంగా బీహార్‌పై వరాల జల్లు కేటాయించారు. పలు కేటాయింపులు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ఎలాంటి ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం తీర్మానం నోటీసు అనాలోచిత చర్య అంటూ గత గురువారంనాడు విపక్షాల నోటీసును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తోసిపుచ్చిన నేపథ్యంలో జైరాం రమేష్ శుక్రవారంనాడు స్పందించారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓవైపు జరుగుతుండగా ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్‌సైట్ తప్పుదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ చేశారు.
హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐకి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.