Home » Jagtial
నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచిపోయినా పేదలకు కేటాయించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సెర్ప్(సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు జీవో నంబరు 250ను ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ జారీ చేశారు.
ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటిగా అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హామీ పద్దు కింద చేపట్టిన పనులకే మోక్షం లేకుండా పోయి వెక్కిరిస్తున్నాయి.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయాల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులను సేకరించే వ్యవసాయ మార్కెట్లపై పర్యవేక్షణ కొరవడింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లు సైతం ఇన్చార్జీల పాలనలో కొనసాగుతున్నాయి. ఒక్కో సెక్రెటరీకి మూడు, నాలుగు మార్కెట్ల బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు.
కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్టీయుసీ బూమల్ల చందర్, ఐఎఫ్టీయు నాయకులు కె. విశ్వ నాథ్, సిహెచ్ శంకర్, వైకుంఠం మాట్లాడారు.
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలకు నిరీక్షణ తప్పడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర అవుతున్నా నామినేటెడ్ పదవుల నియామకంలో ఇంకా కొన్ని అవకాశాలను భర్తీ చేయడం లేదు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి పలు పదవులతో పాటు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆలయాల చైర్మన్ల పదవులపై కన్నేసిన నాయకులు నిర్విరామంగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తునే ఉన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 జిల్లా రవాణాశాఖ ఖజానా గలగల లాడింది. రూ.39.25 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 2024-25 అర్థిక సంవత్సరం రూ.1.55 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది. 2022 -23 అర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 33.08 కోట్ల ఆదాయం వచ్చింది.