Home » ED raids
హవాలా ఆపరేటర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు కొరడా ఝళిపించారు. గురువారం హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‍లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో 13 మంది హవాలా ఆపరేటర్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
టాలీవుడ్ హీరో మహే్‌షబాబును ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని సురానా డెవలపర్స్, సాయిసూర్య డెవలపర్స్ సంస్ధల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
సురానా గ్రూపు కంపెనీలు.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ముంచేశాయి. ఈ కంపెనీలకు చెందిన మరో రెండు రియల్ ఎస్టేట్ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు.
వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్‌ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్, ఆయన తనయుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తోంది.
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం సోదాలు నిర్వహించింది.
వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐలకు తాను ఫిర్యాదు చేశానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. త్వరలో జగన్తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి ... ఇది ఆరంభం మాత్రమేనని సీఎం రమేశ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏకంగా 9 రాష్ట్రాల్లోని 44 ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది.