Share News

ED Raids: స్యూ ఇన్‌ఫ్రాలో ఈడీ సోదాలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:25 AM

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డాయనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని స్యూ ఇన్‌ఫ్రా (సిల్‌), ప్రసాద్‌ అండ్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఎ్‌సపీడబ్లూపీఎల్‌) సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం సోదాలు చేసింది.

ED Raids: స్యూ ఇన్‌ఫ్రాలో ఈడీ సోదాలు

  • మనీలాండరింగ్‌ ఆరోపణలతో హైదరాబాద్‌లో తనిఖీలు

  • రూ.120 కోట్ల విలువైన ఆస్తులు, 33 బ్యాంకు ఖాతాలు సీజ్‌

  • బ్యాంకులను మోసగించి, రుణాల

  • దారిమళ్లింపు ఆరోపణలతో ఇప్పటికే సీబీఐ కేసు

హైదరాబాద్‌; జూలై 23: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించి మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డాయనే ఆరోపణలతో హైదరాబాద్‌లోని స్యూ ఇన్‌ఫ్రా (సిల్‌), ప్రసాద్‌ అండ్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీఎ్‌సపీడబ్లూపీఎల్‌) సంస్థల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం సోదాలు చేసింది. కంపెనీల కార్యాలయాలతోపాటు ప్రమోటర్ల నివాసాల్లోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను, సుమారు రూ.120 కోట్లు విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నామని.. ఈ సంస్థలు, వాటి ప్రమోటర్లు, కుటుంబ సభ్యులకు చెందిన 33 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశామని ఈడీ అధికారులు ప్రకటించారు.


సిల్‌, పీఎ్‌సపీడబ్ల్యూపీఎల్‌ సంస్థలు కలసి ‘స్యూ ఎల్‌ఎ్‌సవై హైవేస్‌ లిమిటెడ్‌’ పేరిట కన్సార్షియంగా ఏర్పడి.. ఉత్తరప్రదేశ్‌లో ఒక హైవే నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్నాయి. దీనిని చూపి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఆధ్వర్యంలోని 14 బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 1,700 కోట్ల రుణం మంజూరు చేయించుకున్నాయి. ఇందులో రూ.603 కోట్లు రుణం విడుదలైంది. అయితే ఈ రుణాన్ని.. సిల్‌ గ్రూపు కంపెనీల మధ్య సబ్‌ కాంట్రాక్టుల పేరిట దారి మళ్లించారని, బ్యాంకులకు చెల్లించకుండా ఎగ్గొట్టారన్న ఫిర్యాదులపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలు దారి మళ్లించిన సొమ్మును అక్రమ మార్గాల ద్వారా తరలించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.

Updated Date - Jul 24 , 2025 | 02:25 AM