ED Raids: శివ బాలకృష్ణ కేసు.. మూడు ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:48 AM
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ అధికారులు గురు, శుక్ర వారాల్లో సోదాలు నిర్వహించారు.

లెక్కల్లో చూపని రూ.72లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన మూడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ అధికారులు గురు, శుక్ర వారాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.72లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీ కృష్ణా కన్‌స్ట్రక్షన్స్, క్వారీజోన్ స్పేస్, ఉదయ ఎస్‌ఎ్‌సవీ ప్రాజెక్టుల కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించామని ఈడీ హైదరాబాద్ జోన్ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏతో పాటు టీఎస్ రెరా కార్యదర్శిగా పని చేసిన శివ బాలకృష్ణ తన అక్రమార్జనను రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ నెల మొదటి వారంలోనే శివ బాలకృష్ణ, అతడి సోదరుడు ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శివ బాలకృష్ణపై తొలుత ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేయగా, రూ.200కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలో దిగారు. ఉదయ ఎస్‌ఎ్‌సవీ ప్రాజెక్టు యజమాని రాజశేఖర్ బాబు నుంచి శివబాలకృష్ణ రూ.కోటి లంచం తీసుకుని లబ్ధి చేకూర్చారని ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, లంచంతోపాటు ఆ సంస్థలో భాగస్వామ్యం కూడా తీసుకున్నట్టుగా ఈడీ సోదాల్లో డాక్యుమెంట్లు లభించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలను వీక్షించండి..
బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!
గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..