తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుక మార్చి 21న టోరంటోలో వైభవంగా జరిగింది.
హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఈసారి 50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ సేవల నిపుణులు చెబుతున్నారు. అధిక వీసా ఫీజు, లాటరీ వ్యవస్థ విధానంపై అనిశ్చితి నేపథ్యంలో అనేక మంది వీసా దరఖాస్తు ప్రయత్నాలను విరమించుకున్నారని అంటున్నారు.
ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.
సింగపూర్‌లోని చాంగీ రామర్ దేవాలయం, సెంగ్‌కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో మార్చి 19, 20, 2026 తేదీలలో ఉగాది పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహించుకున్నారు.
'అడాప్ట్-ఎ-విలేజ్' కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ యూఎస్ఏ సుమారు 350 మంది సమాజ సభ్యులతో ఈ ఏడాది తమ మొదటి 'మ్యూజిక్ అండ్ డాన్స్ ఫర్ విజన్' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
లండన్ వీధుల్లో పాన్ తిని ఉమ్మేసిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులపై అక్కడి కోర్టులు భారీ జరిమానా విధించాయి. ఒక్కొక్కరికీ 1,391 పౌండ్‌ల జరిమానా విధించాయి.
అమెరికాలో పలువురు అమాయకులను మోసగించి డబ్బులు దండుకున్న ఒక భారతీయ వ్యక్తి కోసం ఎఫ్‌బీఐ ముమ్మర గాలింపు చర్యలు చేపడుతోంది. అతడి వివరాలు తెలిస్తే తమకు చెప్పాలని ప్రజలను బుధవారం కోరింది.
మార్చి 15వ తేదీన డెలావేర్‌లోని మిడిల్‌టౌన్ ‘బెస్ట్ బ్రెయిన్స్’ వేదికగా మిడ్-అట్లాంటిక్ చెస్ టోర్నమెంట్ 2026ను తానా అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే మంచి ప్రచారం చేయడం వల్ల ఎంతోమంది యువ చెస్ ఆటగాళ్లు పాల్గొని తమ సత్తా చాటారు.
దుబాయ్ నగరంలో తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు రసమయి ఇఫ్తార్ విందును నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు తెలుగు ప్రవాసీయులలో ఆప్యాయత పెంపుదలకు దోహదం చేస్తాయని సంస్థ అధ్యక్షుడు యస్.వి.రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం కువైత్‌లోని సాల్మీయా ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మైనారిటీ నాయకులు ముస్తాఖ్ ఖాన్, యువనాయకులు ఓలేటి రెడ్డయ్య చౌదరి అధ్యక్షతన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.