Share News

Jayaram Komati: ప్రియమైన NRITDP సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

ABN , Publish Date - Nov 29 , 2025 | 07:41 AM

ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్‌తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.

Jayaram Komati: ప్రియమైన NRITDP సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి
NRITDP Jayaram Komati

ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6న అమెరికా సందర్శించనున్నారు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో తెలుగు ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఎన్నారైలతో నారా లోకేష్ పలు విషయాలపై సంభాషించనున్నారు.


నారా లోకేష్ అమెరికా పర్యటనను జయప్రదం చేయాలని అమెరికా తెలుగు కమ్యూనిటీకి.. ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరామ్ కోమటి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 'మనమందరం కలిసి నారా లోకేష్ దార్శనిక నాయకత్వానికి పరిపూర్ణమైన మద్దతునిచ్చేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. ఉత్తర అమెరికా, కెనడా అంతటా ఉన్న అందరు NRITDP సైనికులు దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని, దీనిని విజయవంతం చేయడంలో సహాయపడాలని నేను వ్యక్తిగతంగా అభ్యర్థిస్తున్నాను.' అని జయరామ్ కోమటి ఆ ప్రకటనలో కోరారు.


'దయచేసి దీనిని నా వ్యక్తిగత ఆహ్వానంగా పరిగణించి, ఈ స్ఫూర్తిదాయకమైన సమావేశంలో భాగం కావాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నేను డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 7, 2025 వరకు డల్లాస్‌లో ఉంటాను. మీరు నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను.' అని జయరామ్ తన ప్రకటనలో వెల్లడించారు.


NRI.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2025 | 07:56 AM