రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ కామన్ పోస్టు
జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లో నేరుగా బీటెక్, ఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశానికి నిర్వహించే ఈసెట్‌లో
జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 17, 2025 దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ .
ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సైబర్ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ - పంచాయతీరాజ్‘(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీటీడీఎమ్), ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నారు.
టెన్త్, ITI ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులకు రైల్వేలో పనిచేసేందుకు గొప్ప ఛాన్స్.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. 1,000 మందికి పైగా ఈ నియామాకం కింద నియమించుకోనున్నారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ‘మ్యాట్ 2025’ సెప్టెంబర్ సీజన్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్’(మ్యాట్) ఒకటి. ఈ ఎంట్రెన్స్‌ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్ట్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.