Jeff Bezos Advice: ఈ ఏఐ జమానాలో యువత కెరీర్‌కు శ్రీరామ రక్ష ఇదే
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:43 PM
ఈ ఏఐ జమానాలో అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకోవడం ఎలా అనేది యువతను వేధిస్తున్న ప్రశ్న. అయితే, అమెజాన్ ఉద్యోగుల నుంచి తాను ఆశించేది ఏమిటో సంస్థ అధినేత జెఫ్ బెజోస్ చాలా కాలం క్రితమే స్పష్టంగా తెలియజేశారు. ఆయన మాటలనే యువత ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి తరం యువత అంతర్జాతీయ స్థాయి అవకాశాలను కోరుకుంటోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ అమెజాన్, ఫేస్ బుక్ వంటి సంస్థల్లో అనుభవం గడించి సొంత సంస్థలను నెలకొల్పాలనుకునే వారు ఎందరో ఉన్నారు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై మాత్రం చాలా మందికి స్పష్టత ఉండదు. అయితే, ఈ విషయంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ స్పష్టమైన సూచనలు చేశారు (Jeff Bezos).
తన సంస్థలోని ఉద్యోగుల నుంచి తాను ఆశించేది ఏమిటో చాలా కాలం క్రితమే జెఫ్ బెజోస్ స్పష్టంగా చెప్పారు. కొత్తగా ఆలోచించలేని వారు తమ సంస్థలో ఎక్కువకాలం మనలేరని అన్నారు. తన సంస్థలో చేరాలనుకునే వారి సృజనాత్మకతను అంచనా వేసేలా ఇంటర్వ్యూ సాగుతుందని అన్నారు. అప్పటికే అందుబాటులో ఉన్న మార్గాల్లో కాకుండా కొత్త మార్గాన్ని కనుగొనేందుకు ప్రయత్నించే వారివైపు తాను మొగ్గుచూపుతానని అన్నారు (Career in AI Era).
‘నేను అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారు ఈ మధ్య ఏదైనా కొత్తది కనుక్కున్నారా? అని అడుగుతాను. అంటే.. వాళ్లు పేటెంట్ వచ్చేంత కొత్త విషయాలను కనుక్కోనక్కర్లేదు. సమస్యలను సృజనాత్మకతతో పరిష్కరించే వారిగా ఉండాలి. కొత్తగా ఆలోచించలేని వారు ఎక్కువ కాలం కొనసాగలేరు’ అని స్పష్టం చేశారు. అపజయం, సృజనాత్మకత కవలలని కూడా మరో సందర్భంగా జెఫ్ బెజోస్ వ్యాఖ్యానించారు. ప్రయోగాలు, వైఫల్యాలు లేకుండా సృజనాత్మకత ఉండదని చెప్పారు (Bezos on Creativity).
యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గణాంకాల ప్రకారం, దేశ జీడీపీలో దాదాపు 50 శాతం సృజనాత్మక కార్యకలాపాల వల్లే వస్తోంది. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ వారందరూ సృజనాత్మకత ఆలంబనగా తమ వ్యాపార సామ్రాజ్యాల్ని నిర్మించుకున్నారు. మనిషిని ఏఐ మించిపోనుందన్న భయాల నడుమ యువత కెరీర్‌కు సృజనాత్మకతే శ్రీరామ రక్ష అని నిపుణులు కామెంట్ చేస్తున్నారు. రేసులో చివరి వరకూ నిలిచేదెవరో సృజనాత్మకతే నిర్ణయిస్తుందని అంటున్నారు. వ్యక్తులతో పాటు కంపెనీలకూ ఇదే సూత్రం వర్తిస్తుందని అంటున్నారు.
ఇవీ చదవండి:
NEET PG: కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..
ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. కొత్త తేదీలివే..