Share News

కాటేసిన పాముని పట్టుకుని ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం, వీడియో వైరల్!

ABN , Publish Date - Mar 18 , 2026 | 08:40 AM

వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన పాము కాటేసింది. అయినా, ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నడుచుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాటేసిన పాముని పట్టుకుని ఆసుపత్రికి.. వృద్ధుడి సాహసం, వీడియో వైరల్!
Vietnam Snake Bite Incident

ఇంటర్నెట్ డెస్క్: వియత్నాంలోని డా నాంగ్ నగరానికి సమీపంలో ఉన్న డై లోక్ అనే ప్రాంతంలో ఒక 79 ఏళ్ల వృద్ధుడిని విషపూరితమైన నాగుపాము కరిచింది. అంగవైకల్యంతో ఉన్న ఆ వృద్ధుడు ప్రాణాపాయ స్థితిలో కూడా ఏమాత్రం బెదరకుండా ఆ భారీ నాగు పామును పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వైరల్ వీడియలో.. ఓ వృద్ధుడిని పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన అతను.. ఏమాత్రం భయపడకుండా పామును పట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. బాధితుడికి మొదట క్వాంగ్ నామ్ ఉత్తర పర్వత ప్రాంతంలోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత డా నాంగ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ఆ వృద్ధుడి గుండె ధైర్యం ముందు.. అంగవైకల్యం ఓడిపోయింది’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 11:08 AM