Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 25 , 2026 | 06:49 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Breaking News

Live News & Updates

  • Feb 25, 2026 21:50 IST

    అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేతికి గాయం

    • శాసనసభ్యుల క్రీడా పోటీల సందర్భంగా క్రికెట్ ఆడిన రఘురామరాజు

    • ఎడమచేతి మణికట్టుకు గాయం

    • రఘురామరాజును మణిపాల్ ఆసుపత్రికి తరలించిన అధికారులు

    • ఎడమచేతి మణికట్టుకు శస్త్రచికిత్చ చేయాలని సూచించిన వైద్యులు

    • రేపు హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవాలని నిర్ణయం

  • Feb 25, 2026 21:27 IST

    ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు: నెతన్యాహు

    • మోదీ.. మాకు స్నేహితుడి కంటే ఎక్కువ: నెతన్యాహు

    • మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సంతోషకరం: నెతన్యాహు

    • మోదీ పాలనలో అత్యంత వేగంగా భారత్‌ అభివృద్ధి: నెతన్యాహు

    • భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయి: నెతన్యాహు

    • ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం భారత్‌: నెతన్యాహు

  • Feb 25, 2026 21:27 IST

    ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రసంగం

    • భారత్‌కు ఇజ్రాయెల్‌ నిజమైన భాగస్వామి: మోదీ

    • ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్‌ మా భాగస్వామి: మోదీ

  • Feb 25, 2026 21:26 IST

    చండీయాగం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

    • జూబ్లీహిల్స్ నివాసంలో మూడు రోజులుగా యాగం

    • యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్ కుటుంబం

    • రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ప్రత్యేక హోమం

    • సీఎం నివాసంలో నేటితో ముగిసిన చండీయాగం

    • 2023సెప్టెంబర్‌లో కూడా చండీయాగం చేసిన రేవంత్ రెడ్డి

  • Feb 25, 2026 20:43 IST

    ఫాల్కాన్ కేస్‌లో మరో అరెస్ట్

    • ఫాల్కాన్ సీఓఓ వికాస్ కుమార్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ

    • 7,056 డిపాజిటర్ల నుండి 4,215 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఫాల్కాన్ సంస్థ

    • వీటిలో 792 కోట్లు రూపాయలు స్కాం కు పాల్పడిన ఫాల్కాన్

    • దేశ వ్యాప్తంగా ఫాల్కాన్ పై పది కేస్లు నమోదు

  • Feb 25, 2026 20:41 IST

    శ్రీకాకుళం: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన

    • డయేరియా ప్రభావంపై మున్సిపల్‌ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

    • 4 సచివాలయాల పరిధిలో 102 కేసులు నమోదు: మంత్రి నారాయణ

    • 13 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు: నారాయణ

    • 85 మంది ఆస్పత్రిలో ఉన్నారు: మంత్రి నారాయణ

    • 50 టీమ్‌లతో డోర్ టు డోర్ సర్వే చేశాం: మంత్రి నారాయణ

    • మంచినీటి సరఫరాలో ఎలాంటి సమస్య లేదు: మంత్రి నారాయణ

  • Feb 25, 2026 20:30 IST

    పల్నాడు జిల్లా: తేలుకుట్ల గ్రామంలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

    • టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు

    • టీడీపీ కార్యకర్త బత్తుల ఏడు కొండలు కు తీవ్ర గాయాలు

    • గురజాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కి తరలింపు

  • Feb 25, 2026 19:59 IST

    హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్‌ ముందస్తు బెయిల్ పిటిషన్

    • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్‌నాయక్‌పై కేసు నమోదు

    • RRR అరెస్ట్ సమయంలో ఏపీ CID SPగా ఉన్న సునీల్‌నాయక్‌

    • రెండు రోజులు క్రితం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన ఎస్పీ దామోదర్

    • ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన బీహార్ కోర్టు

  • Feb 25, 2026 19:30 IST

    ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • సోనియా, రాహుల్‌ను కలిసిన భట్టి విక్రమార్క దంపతులు

    • తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానపత్రిక అందజేసిన భట్టి

    Bhatti-Vikramarkha.jpg

  • Feb 25, 2026 19:15 IST

    ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు

    • రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్

    • మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్ పెట్టిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో

    • 2025లో రాష్ట్రంలో 4,775 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తింపు

    • 137 బ్యాంక్ బ్రాంచ్‌లలో సోదాలు చేసిన పోలీసులు

    • దేశవ్యాప్తంగా 9,431 క్రైమ్ లింకులు ఉన్నట్లు వెల్లడి

  • Feb 25, 2026 19:00 IST

    రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ షాక్

    • ముంబైలోని రూ.3,717 కోట్ల విలువైన నివాసం జప్తు

    • బ్యాంకు రుణాల మోసానికి పాల్పడిన కేసులో మనీలాండరింగ్ కింద తాజా జప్తు

    • ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం రూ.15,700 కోట్లకు చేరిన వైనం

  • Feb 25, 2026 18:41 IST

    నాగర్‌కర్నూల్‌: పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టనపెట్టుకున్నారు: కేటీఆర్‌

    • రెండు నెలల పసికందు మరణం మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్‌

    • దేవుడి దర్శనం అడిగిన పాపానికి దాడి చేశారు: కేటీఆర్‌

    • పసికందు మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి: కేటీఆర్‌

    పూర్తికథనం

  • Feb 25, 2026 18:37 IST

    టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన శ్రీలంక

    • కొలంబో వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-శ్రీలంక జట్లు

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న న్యూజిలాండ్

  • Feb 25, 2026 17:53 IST

    జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట

    • మనీలాండరింగ్ కేసులో ఈడీ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే

    • ఏడుసార్లు సమన్లు ఇచ్చినా ఒక్కసారి కూడా హాజరుకాలేదన్న ఈడీ

    • మూడుసార్లు హాజరయ్యారని, అరెస్టు చేశారని సోరెన్ న్యాయవాది వాదన

    పూర్తికథనం

  • Feb 25, 2026 17:40 IST

    ఢిల్లీ: యూత్ కాంగ్రెస్ నేతలకు నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ

    • ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సమయంలో నిరసనల ఘటన

    • ఐదుగురు ఇండియన్ యూత్ కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు అరెస్ట్

    • నేడు పటియాలా హౌస్ కోర్టులో హాజరు

    • ఢిల్లీ పోలీసులకు 4 రోజుల కస్టడీ మంజూరు

    • నిరసనల నేపథ్యంపై దర్యాప్తు వేగవంతం

  • Feb 25, 2026 17:39 IST

    రైల్వేలో పార్శిల్‌ యాప్‌ లాంచ్‌తో సరికొత్త అధ్యాయం

    • పార్శిల్‌ యాప్‌ పేరుతో లాజిస్టిక్ సర్వీస్‌ ప్రారంభించిన ద.మ.రైల్వే

    • తొలిదశలో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, గుంటూరు..

    • రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలో పార్శిల్‌ యాప్‌ సర్వీస్‌లు

  • Feb 25, 2026 17:37 IST

    తెలంగాణ వ్యాప్తంగా MRO, RDO కార్యాలయాలకు శాశ్వత భవనాలు

    • తొలిదశలో 60 తహసీల్దార్‌, 5 RDO కార్యాలయాలకు కొత్త భవనాలు

    • రెండోదశలో శిథిలావస్థలో ఉన్న 170 కార్యాలయాల పునర్‌నిర్మాణం

    • సీఎం రేవంత్‌ రెడ్డి సూచనలతో యునిఫామ్‌ డిజైన్‌ భవనాలు

  • Feb 25, 2026 17:36 IST

    ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై గేట్‌ ఫౌండేషన్‌ సిబ్బందికి బిల్‌గేట్స్‌ క్షమాపణ

    • జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై బిల్‌గేట్స్‌ క్షమాపణలు

    • ఇద్దరు రష్యన్‌ మహిళలతో వ్యక్తిగత సంబంధాలున్నట్లు అంగీకరించిన బిల్‌గేట్స్‌

    • ఎప్‌స్టీన్‌ నేరాలతో తనకు సంబంధంలేదన్న బిల్‌గేట్స్‌

    పూర్తికథనం

  • Feb 25, 2026 17:35 IST

    ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోదీ

    • ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్వాగతం

    • ప్రొటోకాల్‌ పక్కనపెట్టి టెల్‌ అవీవ్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నెతన్యాహు

    • ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన

  • Feb 25, 2026 17:34 IST

    అమరావతి: బడ్జెట్ డిమాండ్లపై మంత్రి పయ్యావుల కేశవ్

    • ఆర్థికశాఖకు రూ.40,953 కోట్లు, వాణిజ్యపన్నుల శాఖకు రూ.474 కోట్లు

    • శాసనసభా వ్యవహారాలకు రూ.రూ.162.12 కోట్లు ప్రతిపాదన: పయ్యావుల

    • గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా రూ.9.74 లక్షల కోట్ల అప్పులు: పయ్యావుల

    • అప్పులపై వడ్డీని 12.5 నుంచి 9.1 శాతానికి తగ్గించేలా చర్యలు: పయ్యావుల

    • అభివృద్ధి పనులకు వైసీపీ వదిలేసిన రూ.37 వేల కోట్ల బకాయిలు చెల్లించాం

    • రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు: మంత్రి పయ్యావుల

  • Feb 25, 2026 17:30 IST

    నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికకు ఏర్పాట్లు

    • రేపు ఉదయం 11 గంటలకు మేయర్‌ పదవికి ఎన్నిక

    • నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి గిరిజన మహిళ రిజర్వేషన్‌

    • దేవరకొండ సుజాతకి మేయర్ పదవి దక్కే అవకాశం

  • Feb 25, 2026 16:45 IST

    కృష్ణా: మచిలీపట్నంలో భారీ చోరీ

    • ఉపాధ్యాయురాలి ఇంట్లో భారీ ఎత్తున నగదు, నగలు అపహరించిన దొంగలు

    • సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

    • బాధితురాలి నుండి వివరాలు సేకరిస్తున్న క్రైమ్ పార్టీ సిబ్బంది

  • Feb 25, 2026 16:33 IST

    యూట్యూబర్ కోమలి ఆత్మహత్యపై రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ కామెంట్స్

    • ప్రేమను నిరాకరించడం వల్లే కోమలి ఆత్మహత్య చేసుకుంది: ఇన్‌స్పెక్టర్ వెంకన్న

    • అఖిల్, కోమలి ఇద్దరూ విశాఖ వాసులే..: ఇన్‌స్పెక్టర్ వెంకన్న

    • తన ప్రేమ విషయం అఖిల్‌‌కు చెప్పగా.. నిరాకరించాడు: ఇన్‌స్పెక్టర్

    • అప్పటికే వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్న అఖిల్: ఇన్‌స్పెక్టర్

    పూర్తికథనం

  • Feb 25, 2026 16:31 IST

    భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్ వచ్చేశాడు!

    • తండ్రి అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వెళ్లిన రింకు

    • జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం భారత్ మ్యాచ్

    • ఈ మ్యాచ్‌కు రింకు అందుబాటులో ఉంటాడు: బ్యాటింగ్ కోచ్

    పూర్తికథనం

  • Feb 25, 2026 16:25 IST

    2018 గ్రూప్ 1 అధికారులపై ఏపీ చీఫ్ సెక్రటరీ కీలక నిర్ణయం

    • ఫోకల్ పోస్టుల నుంచి వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశాలు

    • 2018 గ్రూప్ 1 అధికారుల బదిలీపై చీఫ్ సెక్రటరీ యాక్షన్

    • ఫోకల్ పోస్టుల్లో ఉన్న గ్రూప్ 1 అధికారులందరిని వెంటనే రిలీవ్ చేయాలి

    పూర్తికథనం

  • Feb 25, 2026 15:59 IST

    ఒడిశా గనులశాఖ అధికారి నివాసంలో భారీగా నోట్లకట్టలు

    • రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌ అధికారులు

    • నగదు సహా భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న విజిలెన్స్‌

    • రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన..

    • గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మొహంతి నివాసంలో సోదాలు

    పూర్తికథనం

  • Feb 25, 2026 15:43 IST

    స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

    • 50 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 58 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

    పూర్తికథనం

  • Feb 25, 2026 15:25 IST

    అమరావతి: శాసనమండలి చైర్మన్ ఎదుట విచారణకు ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ హాజరు

    • వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళం వెంకట రమణ

    • ఎమ్మెల్సీ పదవికి గతంలో జయమంగళం వెంకటరమణ రాజీనామా

    • రాజీనామాను ఆమోదించాలని మరోసారి చైర్మన్‌ను కోరిన వెంకటరమణ

    • ఏడాది గడిచినా రాజీనామాను ఆమోదించని మండలి చైర్మన్‌

    • ఇప్పటికే ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జయమంగళం వెంకటరమణ

  • Feb 25, 2026 15:23 IST

    మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

    • రూ. 456 కోట్లతో జరగనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు

    • స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కెనాల్‌లో తిరిగిన సీఎం చంద్రబాబు

    • స్థానికంగా ఏఏ పంటలు వేస్తున్నారో రైతుల్ని అడిగి తెలుసుకున్న సీఎం

    పూర్తికథనం

  • Feb 25, 2026 15:22 IST

    డీజీపీని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

    • కామారెడ్డి, నిజామాబాద్ ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేశాం: రామచంద్రరావు

    • హిందూ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: రామచంద్రరావు

    • కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలి: రామచంద్రరావు

  • Feb 25, 2026 14:42 IST

    నా అన్వేషణ అన్వేష్‌కు బిగ్ షాక్

    • అన్వేష్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు

    • అన్వేష్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ఇన్‌స్టాగ్రామ్

    • అసభ్య పదజాలంతో వీడియో విడుదల చేసిన అన్వేష్

    పూర్తికథనం

  • Feb 25, 2026 14:38 IST

    అమరావతి: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

  • Feb 25, 2026 14:38 IST

    మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ చిట్ చాట్

    • బాబాయ్‌ను చంపి కత్తి మా చేతిలో పెట్టారు: లోకేశ్

    • ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే: లోకేశ్

    • హెరిటేజ్‌కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదు: లోకేశ్

    పూర్తికథనం

  • Feb 25, 2026 13:48 IST

    రేపటికి వాయిదా..

    • ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

  • Feb 25, 2026 13:47 IST

    ఆడబిడ్డ నిధి పథకం అమలుపై శానసమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్న

    • ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

    • సూపర్ సిక్స్‌లో ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు: మంత్రి

  • Feb 25, 2026 13:36 IST

    జగిత్యాల: సోదరా గణపతి లొంగిపో: ABNతో మావోయిస్టు గణపతి తమ్ముడు రాంచంద్రరావు

    • స్వగ్రామం, కుటుంబం నీకోసం ఎదురు చూస్తోంది: గణపతి సోదరుడు రాంచంద్రరావు

    • అందరూ లొంగిపోయారు.. నువ్వు కూడా లొంగిపో: రాంచంద్రరావు

    • గణపతికి పోలీసులు హాని తలపెట్టొద్దు: ABNతో తమ్ముడు రాంచంద్రరావు

  • Feb 25, 2026 13:36 IST

    శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌ కూర్మారావు సస్పెన్షన్

    • విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ వేటు

    • ఉన్నతాధికారుల నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం చర్యలు

    • డయేరియా ప్రబలడానికి కారణమంటూ సస్పెన్షన్

  • Feb 25, 2026 13:23 IST

    దేశంలో నక్సలైట్ల ఉనికి పోయింది: టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

    • ఇక అర్బన్ నక్సలైట్ల అంతం చూస్తాం: రాంచందర్‌రావు

    • కుహనా మేధావులు, అర్బన్ నక్సల్స్‌కు రాహుల్ సపోర్ట్ చేస్తున్నారు: రాంచందర్‌రావు

    • తెలంగాణలో కూడా అర్బన్ నక్సలైట్లు లేకుండా చేయాలి: రాంచందర్‌రావు

    • రేవంత్, కేసీఆర్ కమ్యూనిజాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు: రాంచందర్‌రావు

    • Ai సమ్మిట్‌లో కాంగ్రెస్ వ్యహరించిన తీరు దారుణం: రాంచందర్‌రావు

    • రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలి: బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

  • Feb 25, 2026 13:21 IST

    సీఎం రేవంత్‌తో అడోబ్ సీఈవో భేటీ..

    • సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Adobe సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యుడు శంతను నారాయణ్

    • గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌తో చర్చించిన శంతను నారాయణ్

    • గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై Ai ప్రభావం, స్కిల్లింగ్ & రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపై చర్చ

    • తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్

    • ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్

  • Feb 25, 2026 13:19 IST

    అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ

    • దేశ రాజధాని ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలంటూ..

    • అమిత్‌షాకు బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్ వాల్ లేఖ

    • ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకూ లేఖ రాసిన ప్రవీణ్ ఖండేల్ వాల్

  • Feb 25, 2026 13:17 IST

    బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని వసంత ఆత్మహత్య

    • యమున హాస్టల్‌లో ఉరివేసుకుని వసంత ఆత్మహత్య

    • ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న వసంత

    • విద్యార్థిని వసంత స్వస్థలం వనపర్తి జిల్లా

    పూర్తి కథనం

  • Feb 25, 2026 13:16 IST

    యూట్యూబర్ కోమలి కేసు..

    • పోలీసుల అదుపులో కోమలి ప్రియుడు, యూట్యూబర్‌ అఖిల్‌రెడ్డి

    • తనను దూరం పెట్టాడని ఆత్మహత్యకు పాల్పడిన కోమలి

    • పోలీసుల చేతికి చిక్కిన కోమలి సూసైడ్ నోట్

  • Feb 25, 2026 13:14 IST

    IFS ఫలితాలు విడుదల

    • ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్స్‌(IFS) ఫలితాలు విడుదల

    • యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా

  • Feb 25, 2026 12:48 IST

    తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు..

    • విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

    • హైకోర్టు, నాంపల్లి కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు

    • డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్ టీమ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

    పూర్తి కథనం

  • Feb 25, 2026 12:47 IST

    ఏపీ శాననమండలిలో గందరగోళం

    • ఆడబిడ్డ నిధిపై చర్చకు వైసీపీ సభ్యుల పట్టు

  • Feb 25, 2026 12:47 IST

    ఏపీ హైకోర్టుకు హాజరైన సీఎస్‌ విజయానంద్‌

    • గ్రూప్‌-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్‌ ఫోకల్‌ పోస్టులకి..

    • మార్చాలని గతంలో జారీ చేసిన ఆదేశాల అమలు అంశంపై విచారణ

  • Feb 25, 2026 12:46 IST

    ఢిల్లీ: చందన్‌ పార్క్‌ ఏరియాలో దారుణం

    • భార్యతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేసిన ముంచన్‌ కెవాత్‌

    • ఇంట్లో భార్య, ముగ్గురు కుమార్తెల మృతదేహాలను గుర్తించిన పోలీసులు

    • గొంతు కోసి చంపినట్లు గుర్తించిన పోలీసులు

    • పరారీలో నిందితుడు ముంచన్ కెవాత్‌

    పూర్తి కథనం

  • Feb 25, 2026 12:13 IST

    ఇజ్రాయెల్‌కు పర్యటనకు బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ

    • ఇవాళ, రేపు(గురువారం) ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని పర్యటన

    • మోదీ పర్యటన నేపథ్యంలో ఇజ్రాయెల్ పార్లమెంట్(క్నసెట్) భవనం ముస్తాబు

    • భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోనున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనం

    • ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలుకనున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

  • Feb 25, 2026 11:20 IST

    యువతకు అవసరమైన శిక్షణ అందించేలా చర్యలు: మంత్రి లోకేశ్‌

    • దేశంలో తయారయ్యే ఏసీల్లో 50 శాతం ఏపీలో తయారవుతున్నాయి: మంత్రి లోకేశ్‌

    • ఉద్యోగాల కల్పనకు సంబంధించి మంత్రులతో సబ్‌కమిటీ ఏర్పాటు: మంత్రి లోకేశ్‌

    • సెక్టర్‌ల వారిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి..

    • వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టాం: మంత్రి లోకేశ్‌

  • Feb 25, 2026 11:20 IST

    ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం: మంత్రి లోకేశ్‌

    • క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు: మంత్రి లోకేశ్‌

    • అనంతపురం, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 22 క్లస్టర్లు: మంత్రి లోకేశ్‌

    • ఒక రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, ఉపకరణాలు,..

    • విడి భాగాలు ఒకే చోట తయారు చేసేలా ప్రణాళికలు: మంత్రి లోకేశ్‌

    పూర్తి కథనం

  • Feb 25, 2026 11:19 IST

    మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • భారత్- పాక్ మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్‌

    • లేకుంటే పాక్‌లో 35 మిలియన్ల ప్రజలు చనిపోయేవారు: ట్రంప్‌

    • భారత్- పాక్ యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్‌ ప్రధాని చనిపోయేవారని నాతో చాలామంది అన్నారు: ట్రంప్‌

    • టారిఫ్‌లు విధించే హక్కు, అధికారాలు నాకు ఉన్నాయి: ట్రంప్‌

    • అధ్యక్షుడిగా నాకు సర్వాధికారాలు ఉన్నాయి: డొనాల్డ్ ట్రంప్

  • Feb 25, 2026 11:18 IST

    అధికారిపై వేటు..

    • రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌పై వేటు

    • విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ డా.సత్యనారాయణ

    • కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ కెనడి నియామకం

  • Feb 25, 2026 11:01 IST

    మచిలీపట్నంలో పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు

    • రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనతో ఫుడ్‌సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు

    • ఎస్‌.ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల శాంపిల్స్ సేకరణ

    • మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని బాదం పాల ప్యాకెట్లు గుర్తింపు

  • Feb 25, 2026 11:00 IST

    ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య..

    • మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలి

    • సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడితో మూడేళ్లుగా ప్రేమాయణం

    • ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్

    • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య

    పూర్తి కథనం

  • Feb 25, 2026 10:59 IST

    సీఎం చంద్రబాబు సమీక్ష

    • శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

    • వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా

  • Feb 25, 2026 10:36 IST

    రాజధానిలో ఏడీబీ బృందం పర్యటన

    • అమరావతిలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) బృందం పర్యటన

    • ఉండవల్లి పంప్ హౌస్ దగ్గర పనులు పర్యవేక్షించిన బ్యాంక్‌ ప్రతినిధులు

    • నిర్మాణ పనులను వివరించిన CRDA అడిషనల్ కమిషనర్ భార్గవతేజ

  • Feb 25, 2026 10:35 IST

    రక్త నమూనాలు సేకరణ

    • రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో కొనసాగుతున్న నమూనాల సేకరణ

    • బాధితుల రక్త నమూనాలు సేకరించిన వైద్యాధికారులు

    • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 15మందికి చికిత్స, 8మంది పరిస్థితి విషమం

    • కల్తీ పాలు తాగిన బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న అధికారుల సర్వే

  • Feb 25, 2026 10:21 IST

    శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష

    • పాల్గొన్న కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు

    • బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం

    పూర్తి కథనం

  • Feb 25, 2026 10:09 IST

    రాంచీ ఎయిర్‌ అంబులెన్స్ ప్రమాదంలో ట్విస్ట్‌

    • విమానంలో కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఫ్లైట్ డేటా రికార్డర్ లేవని గుర్తింపు

    • కమ్యూనికేషన్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయనున్న అధికారులు

  • Feb 25, 2026 09:42 IST

    ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

    • పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్న

    • వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని వ్యాఖ్య

    • అధిక వేతనం ఉన్నవారు సంక్షేమ పథకాలు పొందలేరని మంత్రి బాలవీరాంజనేయస్వామి జవాబు

    • అందరికీ సంక్షేమ పథకాలందించే అంశాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని సమాధానం

  • Feb 25, 2026 09:32 IST

    నేడు బలమైన రికవరీతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

    • నిన్న IT స్టాక్‌ల భారీ పతనం తర్వాత నేడు గ్యాప్-అప్ ఓపెనింగ్‌

    • మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లిన Nifty IT ఇండెక్స్ రీబౌండ్

    • 82,500 పాయింట్ల నుంచి 82,785 పెరిగిన సెన్సెక్స్

    • మునుపటి క్లోజింగ్ 82,226తో పోలిస్తే దాదాపు 500 పాయింట్ల హైప్

    • 25,550 - 25,600 రేంజ్‌లో ట్రేడ్ అవుతోన్న నిఫ్టీ

    • మునుపటి క్లోజింగ్ 25,425తో పోలిస్తే 140 - 200 పాయింట్ల హైప్

    పూర్తి కథనం

  • Feb 25, 2026 08:52 IST

    ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

    • లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై కాల్పులు

    • తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్

    • ఢిల్లీలోని రోహిణి పరిసరాల్లో లారెన్స్ న్యాయవాదుల బృందంపై దాడి

    • గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి న్యాయవాదుల వాహనంపై కాల్పులు

    పూర్తి కథనం

  • Feb 25, 2026 08:50 IST

    అస్సాం: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన

    • ప్రియుడితో కలిసి కారులో విహారయాత్రకు వెళ్తున్న యువతి

    • కారు ఆపి ఏడుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారం

    • అనంతరం బెదిరించి రూ.10వేలు తమ అకౌంట్‌లోకి బదిలీ

    • సిల్చార్ సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

  • Feb 25, 2026 08:49 IST

    ఏపీ ఉభయ సభల్లో నేడు..

    • ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న శాసన సభ

    • ఏపీ మెట్రో రైలుకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ

    • వ్యవసాయ రంగంపై లఘు చర్చతో ప్రారంభంకానున్న శాసన మండలి

    • అసెంబ్లీలో ఆమోదించిన ఐదు బిల్లులకు ఆమోదం తెలపనున్న మండలి

  • Feb 25, 2026 08:34 IST

    అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైంది: ట్రంప్‌

    • అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం: ట్రంప్‌

    • గతంలో చూడని అమెరికాను రూపొందించుకుందాం: ట్రంప్‌

    • అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు

  • Feb 25, 2026 08:33 IST

    ముగిసిన ACB సోదాలు

    • కడప: పులివెందుల రూరల్ CI వెంకటరమణ నివాసాల్లో ముగిసిన ACB సోదాలు

    • రూ.6 లక్షలు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కీలకపత్రాలు స్వాధీనం

    • పులివెందుల DSP మురళినాయక్‌ను ప్రశ్నించిన ACB అధికారులు

  • Feb 25, 2026 08:32 IST

    యుట్యూబర్ కోమలి ఆత్మహత్య

    • రంగారెడ్డి: చిత్రపురి కాలనీలో యుట్యూబర్ కోమలి ఆత్మహత్య

    • మరో యూట్యూబర్‌ అఖిల్‌రెడ్డితో కోమలి ప్రేమ వ్యవహారం

    • విభేదాలతో ఇంట్లో ఉరేసుకుని కోమలి ఆత్మహత్య

  • Feb 25, 2026 08:18 IST

    AI యాప్‌లలో భారీ డేటా లీక్..

    • సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్న భారీ డేటా ఎక్స్‌పోజర్

    • 120 కోట్లకు పైగా KYC రికార్డులు బహిర్గతం

    • రెండు AI యాప్‌ల సెక్యూరిటీ లోపాల వల్ల లీక్

    • పాస్‌పోర్ట్‌లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు లీక్

    • ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలకు అవకాశం ఉందని హెచ్చరిక

  • Feb 25, 2026 08:14 IST

    భారత సంతతి వ్యక్తి కిడ్నాప్ ఆపై హత్య

    • కాలిఫోర్నియాలోని ట్రేసీ సిటీలో దారుణ ఘటన

    • భారత సంతతికి చెందిన అవతార్ సింగ్ కిడ్నాప్ ఆపై హత్య

    • 20 ఏళ్లుగా గురుద్వారాలో వాలంటీర్‌గా పనిచేస్తున్న అవతార్ సింగ్

    పూర్తి కథనం

  • Feb 25, 2026 07:33 IST

    నేటి బంగారం, వెండి ధరలివే..

    • బంగారం ధరలు ఇవాళ(బుధవారం) స్వల్ప పెరుగుదలను సూచిస్తున్నాయి.

    • Comexలో బంగారం ధర ప్రతి ఔన్స్‌కు 22.50 డాలర్లు పెరిగి 5,198.80 డాలర్లుగా ఉంది.

    • దేశంలో ప్రతి గ్రాముకు 24 క్యారెట్ సుమారు రూ.16,178 నుంచి రూ.16,244గా ఉంది.

    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.16,179 వద్ద కొనసాగుతోంది.

    పూర్తి కథనం

  • Feb 25, 2026 06:52 IST

    నేడు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

    • రెండురోజులపాటు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ టూర్‌

    • ఉదయం ఢిల్లీ నుంచి టెల్‌అవీవ్‌కు బయల్దేరనున్న ప్రధాని

  • Feb 25, 2026 06:51 IST

    సీఎం చంద్రబాబు పర్యటన

    • నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • వెలిగొండ ప్రాజెక్ట్‌ సందర్శన, ఫీడర్ కెనాల్‌ పనులకు శంకుస్థాపన

  • Feb 25, 2026 06:50 IST

    నేడు నాగర్‌కర్నూల్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌

    • కుమ్మెర జాతరలో రెండేళ్ల చిన్నారి మృతిపై ఆందోళన

    • బాధిత కుటుంబసభ్యులను పరామర్శించనున్న కేటీఆర్‌

  • Feb 25, 2026 06:49 IST

    నేటి నుంచి తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు

    • మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్‌ పరీక్షలు

    • ఉ.9 నుంచి మ.12 గంటల వరకూ పరీక్షల సమయం

    • పరీక్ష రాయనున్న 9,97,975 మంది విద్యార్థులు

    • తెలంగాణవ్యాప్తంగా 1,495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు