వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు చక్రస్నానం.. హాజరైన భక్తులు
ABN, Publish Date - Apr 05 , 2026 | 02:08 PM
ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహోత్సవాలు చివరి రోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం కన్నుల పండుగుగా జరిగింది.
1/11
ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహోత్సవాలు చివరి రోజైన శనివారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం కన్నుల పండుగుగా జరిగింది.
2/11
ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతంతో స్వామి వారిని అర్చకులు మేల్కొపారు.
3/11
అనంతరం ఆలయశుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు శ్రీలక్షణ సమేత శ్రీసీతారాములవారిని తిరుచ్చిలో సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు.
4/11
ఉదయం 10.30 నుంచి 11.15 గంటల వరకు స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
5/11
సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు,చందనంతో అభిషేకం నిర్వహించారు.
6/11
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ పుష్కరణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
7/11
మార్చి 26వ తేదీన ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.
8/11
ఏప్రిల్ 1వ తేదీ రాత్రి అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం జరిగింది.
9/11
ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు సమర్పించారు.
10/11
ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం, పురవీధులు రంగురంగుల దీపాలతోపాటు ప్రదర్శన బోర్డులకు రంగురంగుల లైటింగ్‌తో అలంకరించారు.
11/11
భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగిశాయి.
Updated at - Apr 05 , 2026 | 02:12 PM